in

WHO KNOWS, HOW AND WHEN LUCK HUGS!!

దృష్టం అనేది ఎప్పుడు, ఎవరి ద్వారా, ఎవరిని, వరిస్తుందో చెప్పలేము, ఆ విధంగా అదృష్టం వరించిన వారు మెగా స్టార్లు అవుతారు, స్టైలిష్ స్టార్లు కూడా అవుతుంటారు. సుమారు నాలుగు దశాబ్దాల క్రితం, తన రూమ్ మేట్, ఫ్రెండ్, అయిన సుధాకర్, తనకు వచ్చిన ఒక చిన్న అవకాశాన్ని, దానికంటే పెద్ద అవకాశం కోసం వదులుకుంటే, ఆ చిన్న అవకాశాన్ని అందుకున్న శివ శంకర వర ప్రసాద్, తన కెరీర్ కి “పునాది రాయి” వేసుకొని, మెగా స్టార్ గ ఎదిగి, సినీ పరిశ్రమలో “చిరంజీవి” గ,సగర్వం గ నిలుచున్నారు. అదే విధం గ అప్పుడే సినీ పరిశ్రమలో అడుగు పెట్టి బుడి, బుడి నడకలు నడుస్తున్న అల్లువారి అర్జున్, రెండు దశాబ్దాల క్రితం, సహా నటుడు తరుణ్ ఆహ్వానం తో “దిల్” సినిమా స్పెషల్ షో కి వెళ్లారు, అర్జున్ ని చూసిన సుకుమార్ గారు “ఆర్య” స్టోరీ ని చెప్పారు, అది విన్న అర్జున్ కి మైండ్ బ్లాక్ అయింది,

అప్పటి వరకు తనకు రవితేజ నటించిన “ఇడియట్” లాంటి స్టోరీ పడితే బాగుండు అనుకొనే వారట అల్లు అర్జున్, తన పాలిట ఇడియట్ వంటి సబ్జెక్టు ఇదే అని యెగిరి గంతేసి, ఆ చిత్రాన్ని ఒప్పుకున్నారు. అల్లు అర్జున్ ఎక్సపెక్ట్ చేసినట్లే డిఫ్రెంట్ సబ్జెక్టు, టిపికల్ ట్రీట్మెంట్ తో రెడీ అయిన “ఆర్య ” మూవీ అల్లు అర్జున్ ని ఏకంగా స్టార్ని చేసేసింది. ఆ విధంగా తరుణ్ ద్వారా అల్లు అర్జున్ ని అదృష్టం వరించింది అని అల్లు అర్జున్ గారే స్వయంగా ఒక సందర్భం లో చెప్పారు. “ఆర్య” తరువాత అల్లు అర్జున్ వెనుకకు తిరిగి చూసుకొనే అవసరం లేకుండా ముందుకు దూసుకొని పోయారు, స్టైలిష్ స్టార్ నుంచి నేషన్స్ బెస్ట్ యాక్టర్ అయ్యారు, తనని బెస్ట్ యాక్టర్ చేసిన చిత్రం డైరెక్ట్ చేసింది కూడా సుకుమార్ గారే. కొన్ని కాంబినేషన్లు ఆలా క్లిక్ అయిపోతాయి, అదంతే!!!

Sreeleela gets Double Offer with Akkineni Brothers!

Samantha Lost Interest In south Movies?