in

‘what is your problem ?’ pooja Hegde angry on a journalist!

తాజాగా షాహిద్‌ కపూర్‌తో నటించిన దేవా మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న పూజా అసహనం వ్యక్తం చేసింది. ప్రమోషన్స్‌లో భాగంగా ఓ జర్నలిస్ట్‌.. ‘సల్మాన్‌, హృతిక్‌, రణ్‌వీర్‌, షాహిద్‌ వంటి స్టార్‌ హీరోల చిత్రాల్లో నటించడాన్ని మీరు అదృష్టంగా భావిస్తారా? అసలు అందుకు మీరు అర్హులేనా? అని అడిగారు. దీంతో కాస్త అసహనానికి గురైన పూజా..‘ఎస్‌.. అర్హురాలినే. ఒకవేళ అదృష్టం వల్లే నాకు అవకాశాలు వచ్చాయని మీరు అనుకుంటే..నేను ఏమాత్రం బాధ పడను’ అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

ఇక ఏదైనా అవకాశం వచ్చినప్పుడు దానికి అనుగుణంగా సన్నద్ధమై పూర్తి స్థాయిలో ఆ పాత్రకు న్యాయం చేయాలి. అదే అదృష్టంగా భావిస్తానని చెప్పుకొచ్చారు. ఇక ‘మీరు సినిమాలు ఎలా ఎంచుకుంటారు? స్టార్‌ హీరోల సినిమాలైతేనే చేస్తారా’? అని మరో విలేకరి ప్రశ్నించగా..ఆగ్రహానికి గురైన బుట్టబొమ్మ..‘అసలు మీ సమస్య ఏంటి?’ అని ప్రశ్నించారు. దీంతో వెంటనే అలర్ట్‌ అయిన షాహిద్‌ కపూర్‌ తన జోకులతో ఆ చర్చకు ఫుల్‌స్టాప్‌ పెట్టేలా చేశారు. మొత్తం మీద ఎప్పుడూ నవ్వుతూ ఉండే పూజా కోపానికి గురయ్యారు..!!

Prabhas’s “Rudra” Look Revealed in Vishnu Manchu’s “Kannappa”

happy birthday SEKHAR KAMMULA!