in

what a coincidence brother!!

సినీ రంగంలో ఒక చిత్రమయిన పోకడ మనందరం చూస్తుంటాము, అరవై దాటినా హీరోలు, హీరోలుగానే కొనసాగుతుంటారు, వారి సరసన నటించిన హీరోయిన్లు మాత్రం కొంత కాలానికి అక్కలు, వదినలు అవుతారు, మరి కొంత కాలానికి వదినలు, అమ్మలు అయిపోతారు. యెన్.టి.ఆర్ సరసన “మా దైవం” చిత్రంలో హెరాయిన్ గ సెలెక్ట్ అయిన జయ చిత్ర షూటింగ్ మొదటి రోజు యెన్.టి.ఆర్. ని కలసి నమస్కరించారట, యెన్.టి.ఆ.ర్ ఆమెతో ఏమండీ మా హెరాయిన్ ఎక్కడ అని అడిగారరట, అది విన్న జయ చిత్ర నేనే కదా సర్ మీ హీరోయిన్ అన్నారట. యెన్.టి.ఆర్. వెంటనే మీరు కాదండి మేము అడిగింది మీ అమ్మ గారి గురించి, అన్నారట..

మేమిద్దరం కల్సి అది వరకు “దైవ బలం” అనే చిత్రంలో నటించాము అని అడిగారట. అక్కడే ఉన్న జయ చిత్ర గారి అమ్మ గారు, అమ్మాజీ గారు యెన్.టి.ఆర్. వద్దకు వచ్చి నమస్కరించి కాసేపు పాత జ్ఞాపకాలు నెమరువేసుకున్నారట. ఇలాగె ఉంటాయి సినీ విచిత్రాలు. జయ చిత్ర యెన్.టి.ఆర్. తో కలసి నటించబోయే చిత్రం “మా దైవం” ఆమె అమ్మ గారు యెన్.టి.ఆర్. తో కలసి నటించిన చిత్రం పేరు “దైవ బలం”, రెండు చిత్రాల పేరులో దైవం అని ఉండటం ఒక విశేషం , ఈ రెండు చిత్రాలు సెప్టెంబర్ 17 వ, తేదీ విడుదల కావటం మరో విశేషం. ఇటువంటి విశేషాలు, విచిత్రాలు జరుగుతుంటాయి కాబట్టే దానిని చిత్ర పరిశ్రమ అన్నారు కాబోలు!!!

Prabhas gifts Raja Saab crew​​ As a token of appreciation for their work!

tamannaah to do a special song for vijay devarakonda?