
నందమూరి బాలకృష్ణ, గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న హిస్టారికల్ యాక్షన్ డ్రామా చిత్రంలో మలయాళ నటి హనీరోజ్ కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. మూడేళ్ళ క్రితం బాలకృష్ణ, హనీరోజ్ కాంబినేషన్‌లో ‘వీరసింహారెడ్డి’ వచ్చింది. తాజాగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, హానీరోజ్ కూడా నటిస్తుందన్న వార్తలతో అంచనాలు రెట్టింపయ్యాయి.
బాలకృష్ణ, గోపిచంద్ కలయికలో వచ్చిన వీరసింహారెడ్డి మంచి విజయాన్ని దక్కించుకుంది. దీంతో ఈ కొత్త ప్రాజెక్టుపై అంచనాలు భారీగా ఉన్నాయి. బాలకృష్ణ, గోపిచంద్ మలినేని, హనీరోజ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ని ప్రేక్షకులు ఆదరించారు. ఇదే హిట్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతుండటం నందమూరి అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది..!!

