in

Vishwak Sen Inspiring Commitment to Organ Donation!

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ తో అంతకంతకూ ఎదిగిన హీరోలలో విశ్వక్ సేన్  ఒకరనే సంగతి తెలిసిందే. విశ్వక్ సేన్ వరుసగా దాస్ కా ధమ్కీ, గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో మంచి ఫలితాలను సొంతం చేసుకోగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు ఓటీటీలో సైతం మంచి రెస్పాన్స్ వస్తోందని సమాచారం అందుతోంది..

తాజాగా ఆర్గాన్ డొనేషన్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోగా ఆ నిర్ణయం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది..హైదరాబాద్ లో జరిగిన ఒక ఈవెంట్ కు హాజరైన విశ్వక్ సేన్ తాను అవయవ దానం చేస్తానని ప్రకటించడంతో పాటు తన వివరాలను అందజేశారు. విశ్వక్ సేన్ తీసుకున్న ఈ నిర్ణయానికి వావ్ అనాల్సిందేనంటూ నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలామంది హీరోలు ఈ తరహా ప్రకటనలు చేయడానికి వెనుకాడతారని విశ్వక్ సేన్ కు మాత్రం ఈ విషయంలో ఎవరూ సాటిరారని నెటిజన్లు చెబుతున్నారు..!!

bollywood entry confirmed for happening beauty sreeleela?

f cube ‘sai dharam tej’!