in

vijay sethupathi, Nayanthara and Samantha Film Not Shelved!

విజయ్ సేతుపతి హీరో, సమంత నయనతార హీరోయిన్లు..నయనతార నిర్మాత, పైగా ఆమెకు కాబోయే భర్త ఈ సినిమాకి దర్శకుడు..నిజంగా క్రేజీ కాంబినేషన్ అంటే ఇదే..మరి అలాంటప్పుడు ఈ సినిమా ఎందుకు స్టార్ట్ కాలేదు, మధ్యలోనే ఎందుకు ఆగిపోయింది అని ఎంక్వైరీ చేస్తున్నారు నెటిజన్లు. అయితే, ఈ సినిమా కథ విషయంలో విగ్నేష్ శివన్ కి కొన్ని అనుమానాలు ఉన్నాయని అందుకే సినిమాని ఆపేశాడని రూమర్లు వస్తున్నాయి..అయితే ఈ సినిమాకి సంబంధించి అసలు వాస్తవం ఏమిటంటే..

ఈ సినిమా అనౌన్స్ చేసిన తరువాత సడెన్ గా కరోనా రావడం, అంతలో లాక్ డౌన్ ను పెట్టడం దాంతో ఈ సినిమా ఈ ఏడాదికి పోస్ట్ ఫోన్ అవ్వాల్సి వచ్చింది. ఇక జనవరిలో హైదరాబాద్ లో ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా జరిగింది. దాదాపు నెల రోజులు పాటు షూట్ చేశారు..ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ జులై లో మొదలు అవుతుంది. ఒకేసారి ముగ్గురి డేట్స్ ఉంటేనే తరువాత షెడ్యూల్ మొదలవుతుంది. జులైలో ఈ ముగ్గురు పదిరోజులు పాటు ఈ సినిమాకి డేట్స్ ను ఇచ్చారట.

Chinmayi’s slipper shot reply to netizen who asked nude photo!

Chiranjeevi latest updates about Jr NTR’s health condition!