in

Vijay on Rashmika’s Marriage Proposal: ‘Ask Me 100 Times’

Vijay on Rashmika’s Marriage Proposal: ‘Ask Me 100 Times’

టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి తర్వాత తొలిసారిగా కలిసి ప్రముఖ చాట్ షో ‘కాఫీ విత్ కరణ్’లో సందడి చేశారు. ఈ ఫైనల్ సీజన్ రెండో ఎపిసోడ్‌లో పాల్గొన్న ఈ జంట, తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తమ పెళ్లి ప్రపోజల్ వెనుక ఉన్న అసలు కథను వివరించి అందరినీ ఆశ్చర్యపరిచారు..

షోలో హోస్ట్ కరణ్ జోహార్ ‘మీకు ప్రపోజల్ ఎలా జరిగింది?’ అని అడగ్గా, రష్మిక సిగ్గుతో తలదించుకుంది. దీనిపై విజయ్ దేవరకొండ స్పందిస్తూ, ‘‘మనం పెళ్లి చేసుకుందాం అని తనే నన్ను అడిగింది. నేను ఓకే చెప్పేలోపు సుమారు 100 సార్లు అడిగి ఉంటుంది’’ అని నవ్వుతూ చెప్పారు. విజయ్ మాటలకు కరణ్ ఆశ్చర్యపోగా, రష్మిక కలుగజేసుకుని ‘‘నేను ఏడాది పాటు అడుగుతూనే ఉన్నాను’’ అని అసలు విషయం బయటపెట్టారు. దానికి విజయ్ సరదాగా ‘‘నేనేం అంత చెడ్డవాడిని కాదు’’ అని చెప్పడంతో సెట్‌లో నవ్వులు పూశాయి..!!

nani paradise fame sonali kulkarni reveals her shocking casting couch incident!

mamitha baiju gets praise from kerala cm!