
తాజా ఇంటర్వ్యూలో నాని ప్యారడైజ్ బ్యూటీ సోనాలి కులకర్ణి మాట్లాడుతూ..తాను ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన రోజుల్లో ఏ విధంగా వేధింపులను ఎదుర్కొన్నానో వివరించారు. ఒక సినిమా అవకాశం కోసం నన్ను ఒక దర్శకుడు కలవమన్నాడు. అయితే ఆయన సెక్రటరీ ఫోన్ చేసి.. కలవడానికి వచ్చేటప్పుడు కచ్చితంగా చీర కట్టుకుని రావాలి, అలాగే ఎవరినీ వెంట తెచ్చుకోకుండా ఒంటరిగా రావాలి అని కండిషన్ పెట్టాడు అని ఆమె గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత నగరానికి దూరంగా ఉన్న ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న నకిలీ ఆఫీస్‌కు తనను రమ్మన్నారని..
బయట నుంచి చూస్తే అది ఒక సాధారణ ఇల్లులా ఉందని తెలిపారు..దర్శకుడు కథ చెబుతానని చెప్పి తనను ఒక ప్రత్యేక గదిలోకి పిలిచాడని సోనాలి పేర్కొన్నారు. కానీ, ఆ గదిలోకి వెళ్లిన తర్వాత అక్కడ జరిగిన పరిణామం ఆమెను తీవ్ర భయాందోళనకు గురిచేసిందట. గదిలోకి వెళ్లిన వెంటనే అక్కడ కథ చెప్పడానికి టేబుల్, కుర్చీలు ఏమీ లేవు. కేవలం మధ్యలో ఒక మంచం మాత్రమే ఉంది. ఆ వాతావరణం చూసి నాకు ఒళ్లు గగుర్పొడిచింది. ఏదో తేడా కొడుతోందని క్షణంలో గ్రహించాను. ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. ‘నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నాను’ అని చెప్పి అక్కడి నుంచి ఎలాగోలా బయటపడ్డాను అని సోనాలి కులకర్ణి చెప్పుకొచ్చింది..!!
