in

Director Shankar’s daughter Aditi to make acting debut!

మిళ్ స్టార్ హీరో కార్తి ప్రధాన పాత్రలో డైరెక్టర్ ముత్తయ్య దర్శకత్వంలో విరుమన్‌ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై హీరో సూర్య, జ్యోతిక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఇందులో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ హీరోయిన్‎గా నటిస్తోంది. ఈ విషయాన్ని సూర్య అధికారికంగా ప్రకటించారు. అదితి శంకర్‏కు స్వాగతం. ప్రతి ఒక్కరి హృదయాలను నువ్వు గెలుచుకుంటావు అంటూ ట్వీట్ చేశారు సూర్య.

ఈ మూవీలోని అదితీ లుక్‏ను రివీల్ చేశారు చిత్రయూనిట్. అందులో అదితి పసుపు, ఆకుపచ్చ పరికిణిలో నవ్వుతూ వస్తూ కనిపిస్తున్న లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబర్ 18న ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నారు. అలాగే ఈ సినిమాల కార్తీతో పాటు రాజ్ కిరణ్ కూడా కనిపించబోతున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో కొంబన్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. మరోసారి వీరిద్దరి కాంబో రిపీట్ కాబోతుండడంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది.

beauty kriti sanon fires on media people!

raai laxmi at colors stardust award!