in

veteran actor nassar decided to quit acting?

యాక్టింగ్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాలని ఆయనే స్వయంగా నిర్ణయించుకున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆనారోగ్య కారణాల దృష్ట్యా నాజర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. లాక్‌డౌన్‌ సమయంలో నాజర్‌ గుండె సంబంధిత సమస్యలతో బాధపడ్డారు. అప్పటి నుంచే ఆయన పలు సెలక్టెడ్‌ చిత్రాలనే చేస్తున్నారు. ఇక శాశ్వతంగా నటనకు బ్రేక్‌ ఇచ్చి పూర్తిగా ఆరోగ్యంపైనే ఆయన దృష్టి పెట్టాలనుకుంటున్నారట. అందుకే యాక్టింగ్‌ కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాలని ఆయన అనుకుంటున్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం.

అయితే దీనిపై నాజర్‌ నుంచి కానీ ఆయన కుటుంబ సభ్యుల నుంచి కానీ ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కాగా ‘కళ్యాణ అగత్తిగళ్’ చిత్రంతో నాజర్‌ నటుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత నటుడిగా తనని తాను నిరూపించుకుంటూ గొప్ప నటుడిగా ఎదిగారు. ఆయన సౌత్‌లోనే కాదు హిందీలో కూడా పలు చిత్రాలు చేశారు. ఇక బాహుబలిలో ఆయన పోషించిన బిజ్జలదేవ పాత్రను ఎవరు మర్చిపోలేరు. ఇది మాత్రమే కాదు ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల గుండెల్లో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన ఆయన ఇక సినిమాల్లో కనిపించరంటే ప్రతి ఒక్కరు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇదే నిజమైతే సినీ పరిశ్రమ మరో గోప్ప నటుడిని మిస్‌ అవుతుందంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

MAINTAIN CHESTARA? MIDDLE DROP AYIPOTHARA?

Chiranjeevi gets an invitation to PM’s event in Bheemavaram!