in

bubbly beauty rashi khanna likes doing romantic scenes!

తెలుగులో ఇటీవల కాలంలో హీరోయిన్లను నటన కంటే గ్లామర్ ప్రధానమైన పాత్రలకే ఎక్కువగా తీసుకుంటున్నారు. అయితే అవకాశమొస్తే తమ నటనాపాటవాన్ని చూపించే హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. వారి వ్యక్తిగత అభిప్రాయాల ప్రకారం కొంతమందికి సెంటిమెంట్ సన్నివేశాల్లో నటించడాన్ని ఇష్టపడితే.. మరికొంతమంది కామెడీని చేయడంపై ఆసక్తి చూపిస్తున్నారు. మరికొంతమంది హీరోయిన్ సెంట్రిక్ సబ్జెక్టులపై ఆసక్తి కనబరుస్తున్నారు. కానీ రాశీ ఖన్నా మాత్రం వీటికి భిన్నంగా ఉంది. తనకు రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడమంటే ఇష్టమని ఈ ముద్దుగుమ్మ స్పష్టం చేసింది.

తెరపై హీరోలతో రొమాన్స్ చేయడం చాలా సులభమైన పని ఆమె అభిప్రాయపడింది..”నా అభిప్రాయం ప్రకారం కామెడీ పండించడం చాలా కష్టం. ఫ్రేమ్‌లో ఇతర నటుల నటనపై మన టైమింగ్ ఆధారపడి ఉంటుంది. కానీ రొమాన్స్ అలా కాదు. కామెడీతో పోలిస్తే రొమాన్స్ సీన్స్ చాలా సులభం. ఇప్పటి వరకు రొమాంటిక్ సన్నివేశాలు చేసి చేసి బోర్ కొట్టింది. ప్రస్తుతం కామెడీని ఎంజాయ్ చేస్తున్నా” అని రాశీ ఖన్నా తెలిపింది. యాక్టింగ్‌లో తనకున్న అభిమానాన్ని తెలియజేసింది రాశీ. ప్రస్తుతం ఆమె పక్కా కమర్షియల్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం చేయడంపై తాను ఎంతో సంతోషంగా ఉన్నానని, కామెడీ చేయగల నటి గుర్తింపు లభించినందుకు ఆనందంగా ఉందని తెలిపింది.

Did pigeons cause heroine Meena’s husband’s death?

Yashika Anand Hot Pics In Floral Green Lehenga!