వేణు తొట్టెంపూడి.. ఆరు అడుగుల అందగాడిగా ఒకప్పుడు టాలీవుడ్లో పేరు తెచ్చుకున్న హీరో. కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్నా కూడా ఏ పాత్ర అయినా ఈజీగా చేయగలనని నిరూపించుకున్నాడు. ఎన్నో వరుస హిట్స్ తర్వాత వేణుకు ఫ్లాప్స్ ఎదురయ్యాయి. దీంతో అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఆ తర్వాత తానే స్వయంగా సినిమాలకు దూరమవ్వాలని నిర్ణయించుకున్నాడు. కానీ రామారావు ఆన్ డ్యూటీ కథ తనకు నచ్చడంతో రీ ఎంట్రీ ఇవ్వడానికి ఒప్పుకున్నారు…
రవితేజ హీరోగా వచ్చిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ ప్రేక్షకులను మెప్పించలేక బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. కానీ వేణు క్యారెక్టర్‌కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అందుకే ఇప్పుడు మహేశ్ బాబు, త్రివిక్రమ్ సినిమాలో కూడా వేణును ఓ కీలక పాత్ర కోసం తీసుకోవాలని ఆలోచిస్తున్నారట మేకర్స్. అయితే త్రివిక్రమ్ రైటర్‌గా ఉన్న రోజుల్లో వీరిద్దరి కాంబినేషన్లో ‘స్వయంవరం’, ‘చిరునవ్వుతో’ చిత్రాలు వచ్చాయి..ఈ రూమర్స్ నిజమయితే త్రివిక్రమ్ డైరెక్షన్లో వేణు చేసే మొదటి సినిమా ఇదే అవుతుంది..