in

Vamshi Paidipally Bollywood debut with Shahid Kapoor?

రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ , నాగార్జున లాంటి సూపర్ స్టార్స్ తో వర్క్ చేసిన వంశీ పైడిపల్లి ఇప్పుడు ఒక బాలీవుడ్ ప్రాజెక్ట్ చేయనున్నట్లు టాక్. అదీ షాహిద్ కపూర్ లాంటి టాలెంటెడ్ హీరోతో. రీసెంట్ గా షాహిద్ ని కలిసి వంశీ కథ చెప్పారని, కథ నచ్చటంతో షాహిద్ కూడా ఓకే చెప్పినట్టు టాక్ . ఈ సినిమాని దిల్ రాజ్ ప్రొడ్యూస్ చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే  బాలీవుడ్ లో షాహిద్ తో దిల్ రాజ్  ‘జెర్సీ ‘ రీమేక్ చేసారు..

వంశీ పైడిపల్లి ‘ఊపిరి’ తప్ప అన్ని సినిమాలకి దిల్ రాజ్ ప్రొడ్యూసర్ కావటంతో  ఈ సారి ఈ త్రయం కలిసి వర్క్ చేయటానికి రెడీ అయినట్టు తెలుస్తోంది. అసలు షాహిద్ ని ఒప్పించింది దిల్ రాజే అని టాక్. ఈ మధ్య కాలంలో సౌత్ డైరెక్టర్స్ బాలీవుడ్ లో సత్తా చాటుతున్నారు. షారుఖ్ తో  అట్లీ చేసిన జవాన్, రణబీర్ తో యానిమల్ చేసిన సందీప్ వంగా సాలిడ్ హిట్స్ కొట్టారు. మురుగు దాస్, క్రిష్, ప్రభుదేవా లాంటి  సౌత్ వాళ్ళు అక్కడ సత్తా చాటారు. ఈ లిస్టులో ఇప్పుడు వంశీ చేరాడు..!!

Rana Daggubati to play a powerfull villain in Rajinikanth ‘Vettaiyan’!

dusky beauty Pooja Hegde in talks for Tillu Cube?