in

Rana Daggubati to play a powerfull villain in Rajinikanth ‘Vettaiyan’!

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నారు. తాజాగా ఆయన జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో ‘వెట్టయాన్‌’ చిత్రంలో నటిస్తున్నాడు. విద్యా వ్యవస్థలోని అవినీతి మరియు అరాచకాలను చూపిస్తూ కమర్షియల్ హంగులు కలబోసిన సందేశాత్మక కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తుండడం విశేషం. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో అమితాబ్‌ బచ్చన్‌, ఫహాద్‌ ఫాజిల్‌, రాణా మరియు రితికా సింగ్‌ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు..

కాగా రజనీకాంత్ కి ధీటైన విలన్ గా రాణా కనబడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో రాణా ప్రతినాయక పాత్రలో నటించిన బాహుబలి చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అనంతరం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ లో కూడా కథానాయకుడికి ధీటైన ప్రతినాయక ఛాయలున్న పాత్రలో రాణా మెప్పించాడు. తాజాగా రజనీకాంత్ తో ఢీ కొట్టేందుకు రెడీ అవుతుండడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడుతున్నాయి..!!

KALPANA ROY — THE CURSED

Vamshi Paidipally Bollywood debut with Shahid Kapoor?