in

‘vakeel saab’ motion poster review!

న్యాయవాది అంటే నల్లకోటు వేసుకుని స్టయిల్ స్టయిలుగా కనిపిస్తారు. క్లాసుగా ఉంటారని చెప్పవచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి క్లాసు ప్లస్ మాసులో మంచి ఇమేజ్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసినట్లు అర్థమవుతోంది. పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’. బోనికపూర్ సమర్పణలో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈరోజు పవన్ పుట్టినరోజు సందర్భంగా సినిమా మోషన్ పోస్టర్ విడుదల చేశారు. అందులో ఒక చేతితో క్రిమినల్ లా పుస్తకాన్ని, మరో చేతితో బేస్ బాల్ బ్యాట్ ను పట్టుకుని పవన్ కనిపించారు. మోషన్ పోస్టర్ ప్రారంభంలో జాతిపిత మహాత్మా గాంధీని, ఆ వెంటనే భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ను చూపించారు.

వాళ్ళిద్దరి ఆదర్శాలను పాటించే వ్యక్తిగా హీరోను ప్రజెంట్ చేశారు. ఆ వెంటనే వచ్చిన బేస్ బాల్ బ్యాట్ సినిమాలో పవన్ ఇమేజ్ కి తగ్గట్టు మాంచి మాస్ ఫైట్లు కూడా ఉంటాయని హింట్ ఇచ్చింది. బేస్‌బాల్ బ్యాట్‌తో ‘వకీల్‌సాబ్’ బాదుడు మామూలుగా ఉండదని అభిమానులు ఆశిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా పవర్ఫుల్ కళ్ళతో పవన్ కళ్యాణ్ ఇచ్చిన లుక్ అభిమానులను అమితంగా ఆకట్టుకునేలా ఉంది. మొత్తంమీద అభిమానులకు వకీల్ సాబ్ నుండి వచ్చిన మంచి ట్రీట్ ఇది అని చెప్పాలి.

only a true power star fan can win this quiz!

kajal agarwal reveals lip-lock secret!