in

pawan kalyan gets emotional about his fans death!

పవర్‌స్టార్ మానియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా వస్తోందంటే అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయనని అభిమానించే అభిమాన గణం కోట్లల్లో వున్నారు. ఇక ఆయన బర్త్‌డే వచ్చిందంటే ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా వుండదు. గురువారం పవన్ బర్త్‌డే సందర్భంగా ఇప్పటికే సోషల్ మీడియాని మొతెక్కిస్తున్న ప్రధాన వీధుల్లో ఫ్యాన్స్ ఫ్లెక్సీలు కడుతూ అంబరాన్నంటేలా సంబరాలు చేయడం మొదలుపెట్టారు. అయితే పవన్ కోసం ఫ్లెక్సీలు కడుతూ కుప్పం నియోజక వర్గానికి చెందిన జనసైనికులు ముగ్గురు సోమశేఖర్ , రాజేంద్ర, అరుణాచలం విద్యుత్ షాక్‌తో మృతి చెందారు.

శాంతిపురం దగ్గర ఈ దుర్ఘటన జరిగింది. దవీంతో స్పందించిన పవన్‌కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తన కటౌట్ కడుతూ ముగ్గురు చనిపోయారని తెలిసి తన మనసు కలిచివేసిందని, ఇది మాటలకందని విషాదమని, ఆ తల్లిదండ్రుల గరక్భశోకాన్ని తీర్చలేను కానీ నేను వారికి బిడ్డగా నిలుస్తానన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని పార్టీ కార్యాలయ సిబ్బందిని ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్ ఆదేశించారు. గాయాల పాలైన వారికి మెరుగైన వైద్య సేవలు అందించేలా స్థానిక నాయకులతో చర్చలు జరుపుతున్నట్టు ఓ ప్రకటనలో పవన్‌కల్యాణ్ వెల్లడించారు.

sunil is back as a hero again!

LATHA SRI GARINI LAAGI CHEMPA DEBBA KOTTINA SRI HARI!