తెలుగు ఇండస్ట్రీ తనకు చాలా బాగా నచ్చిందని.. ఒక్క సినిమాతోనే ఇక్కడి ప్రేక్షకులు తనపై చూపించిన అభిమానానికి పొంగిపోతున్నానని తెలిపింది కృతి శెట్టి. ఈ సందర్భంగానే తనకు ఒక కోరిక ఉందని చెప్పుకొచ్చింది. సినిమాలో తన పాత్రకు తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలని ఆశపడుతుందంట. ఈ కోరిక నెరవేర్చే దర్శకుడి కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది.
ఈ రోజుల్లో చాలామంది హీరోయిన్లు సొంత డబ్బింగ్ చెప్పుకోవడానికి ఆలోచిస్తున్నారు. కాకపోతే కీర్తి సురేష్, సాయిపల్లవి లాంటి కథానాయికలు తెలుగు సరిగ్గా రాకపోయినా నేర్చుకుని మరి డబ్బింగ్ చెబుతున్నారు. ఇప్పుడు వాళ్ల బాటలోనే కృతి శెట్టి కూడా సొంత డబ్బింగ్ చెప్పుకోవాలని ఆశపడుతోంది. ఫ్యూచర్ లో తప్పకుండా చేసి చూపిస్తాను అంటుంది..