in

Trivikram Srinivas next is a multi-starrer?

నిజానికి గుంటూరు కారం త‌ర‌వాత అల్లు అర్జున్‌తో త్రివిక్ర‌మ్ ఓ సినిమా చేయాలి. అయితే దానిపై ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి స్ప‌ష్ట‌త లేదు. అల్లు అర్జున్ దృష్టి బోయ‌పాటి, అట్లీల‌పై ఉంది. పుష్ష 2 త‌ర‌వాత వీళ్ల‌లో ఒక‌రితో బ‌న్నీ సినిమా సైట్స్‌పైకి వెళ్తుంది. ఆ త‌ర‌వాతే త్రివిక్ర‌మ్ సినిమా మొద‌ల‌వుతుంది. అంటే ఈలోగా త్రివిక్ర‌మ్ మ‌రో సినిమా చేయాల‌న్న మాట‌. త్రివిక్ర‌మ్ ముందు కూడా రెండు మూడు ఆప్ష‌న్స్ ఉన్నాయి. రామ్ త్రివిక్ర‌మ్ ఓ సినిమా చేస్తాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

నాని – వెంక‌టేష్ కాంబినేష‌న్‌లో ఓ మ‌ల్టీస్టార‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు కూడా ఉన్నాయ‌ని తెలుస్తోంది. రామ్ తో సోలో సినిమా కంటే, నాని – వెంకీతో మ‌ల్టీస్టార‌రే బెట‌ర్‌. కానీ వెంక‌టేష్ మ‌ల్టీస్టార‌ర్లు చేయ‌డానికి ఇప్పుడు అంతగా స‌ముఖంగా లేడ‌ని స‌మాచారం. ఒక‌వేళ వెంకీ త‌ప్పుకొంటే ఆ స్థానంలో మ‌రో హీరోని తీసుకోవాలి. అందుకోసం కూడా ప్ర‌య‌త్నాలు మొద‌ల‌య్యాయ‌ని స‌మాచారం. ఆ హీరో తేలేవ‌ర‌కూ త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమాపై ఎలాంటి స్ప‌ష్ట‌తా రాన‌ట్టే..!!

nagarjuna was not the first choice for cult classic shiva!

bollywood bomb Janhvi Kapoor To Star Opposite Suriya?