in

thalapathy vijay joining forces with rrr makers!

తాజాగా టాలీవుడ్ బడా బ్యానర్ అయిన డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విజయ్ ఓ సినిమా చేస్తున్నాడని లేటెస్ట్ గా సమాచారం అందింది. మార్చ్ లేదా ఏప్రిల్ లో ఈ సినిమా ప్రారంభం కానున్నదట. అయితే ఈ సినిమా డైరెక్టర్ ఎవరూ అన్నది మాత్రం ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. ఇక లాస్ట్ ఇయర్ విజయ్ దిల్ రాజు నిర్మాణం లోనే వారిసు సినిమా చేయగా, ఆ సినిమాని టాలీవుడ్ డైరెక్టర్ వంశి పైడిపల్లి దర్శకత్వం వహించాడన్న సంగతి తెలిసిందే.

అలాగే డివివి బ్యానర్ లో వస్తున్న సినిమాను కూడా ఓ తెలుగు దర్శకుడే తీయనున్నాడని టాక్ నడుస్తుంది. అయితే వారిసు సినిమా పూర్తిగా తెలుగులో తీస్తున్నారని, విజయ్ తెలుగులోనే నటిస్తున్నాడని మేకర్స్ అన్నా, అప్పుడు అది జరగలేదు. మరి ఇప్పుడైనా విజయ్ డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తాడేమో చూడాలి. ఇక విజయ్ ప్రస్తుతం నటిస్తున్న గోట్ సినిమా ఈ ఇయర్ సమ్మర్ చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉండగా, డివివి తీసే సినిమా 2025 సంక్రాంతికి వచ్చే అవకాశం ఉంది..!!

Sandeep Vanga Loves To Make a film with his idol chiranjeevi!

nagarjuna was not the first choice for cult classic shiva!