in

Trisha, tamannah in talks for Nandini Reddy’s supernatural thriller!

తెలుగులో ఫీమేల్ ఓరియెంటెడ్ కథలను డీల్ చేయడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకురాలు నందినీ రెడ్డి ఇప్పుడు డిజిటల్ వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అమెజాన్ కోసం ఆమె ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నారనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే కథ, స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఇందులో కీలకమైన మహిళా పాత్ర కోసం ఇద్దరు స్టార్ హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నారట. త్రిష, తమన్నా భాటియా పేర్లు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నట్టు టాక్.

ఇద్దరిలో ఎవరో ఒకరిని ఈ ప్రాజెక్టులో ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు, కథాంశం, నటీనటుల ఎంపికపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. నందినీ రెడ్డి గతంలోనే మహిళా పాత్రలకు బలమైన ప్రాధాన్యత ఇచ్చే కథలను తెరకెక్కించారు. అలాంటి దర్శకురాలు ఓటీటీ కోసం వెబ్ సిరీస్ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. పైగా త్రిష లేదా తమన్నా లాంటి క్రేజీ హీరోయిన్ ఈ ప్రాజెక్టులో భాగమైతే సిరీస్‌పై ప్రారంభం నుంచే మంచి బజ్ వచ్చే అవకాశం ఉంది..!!

Shankar and AR Murugadoss Team Up! Epic Combo Movie on Cards

Shankar and AR Murugadoss Team Up! Epic Combo Movie on Cards

happy birthday nagarjuna!