in

Kajal Aggarwal learned the power of saying no!

నలభై ఏళ్లకు పైబడిన వయసు, నాలుగేళ్ల చిన్నారికి తల్లి..అయితేనేం, కథానాయికగా కాజల్‌ అగర్వాల్ చరిష్మా ఏమాత్రం తగ్గలేదు. రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌కు కాస్త బ్రేక్‌ ఇచ్చినా..సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనూ అగ్రహీరోల సరసన నటిస్తూ దూసుకెళ్తోంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ స్థాయిలో తెర‌కెక్కిన రామాయ‌ణ సినిమాలో న‌టించ‌గా మ‌రో బాలీవుడ్‌ చిత్రం ‘ది ఇండియన్‌ స్టోరీ’లో అడ్వకేట్‌ అర్చనగా కనిపించనుంది. ఈ చిత్రం మ‌రి కొద్ది రోజుల్లో ప్రేక్ష‌కుల ఎదుట‌కు రానుంది. ఈ నేప‌థ్యంలో కాజల్‌ చెబుతు..కొన్ని సందర్భాల్లో ‘నో’ చెప్పడం ముఖ్యం. నేను ఒక విషయంలో చాలా క్లియర్‌గా ఉంటా. అవకాశాల కోసం ప్రతీదానికి తలాడించాల్సిన పని లేదు..

నేను నా మనసు చెప్పిందే వింటా. ఎంత పెద్ద అవకాశం అయినా..నాకు కంఫర్ట్‌గా లేకపోతే అటువైపే వెళ్లను. అయితే కెరీర్‌ మొదట్లో కొందరు దర్శకులు, నిర్మాతలు క్యారెక్టర్‌కు తగ్గట్టుగా సన్నగా, లావుగా అవ్వమని చెబుతుండేవారు. గత్యంతరం లేక వారి సలహాలు వినేదాన్ని. దాంతో చాలా ఇబ్బందులు పడ్డా. ఇప్పుడైతే కచ్చితంగా ‘నో’ అనేస్తా. పెళ్లయ్యి, ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత..నేను సినిమాలకు ఓకే చెప్పే విధానం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఏ కథ విన్నా ఒక తల్లిగా ఆలోచిస్తున్నా. నా కొడుకు నీల్‌ పెద్దయ్యాక నా సినిమాలు చూసి ‘ఇది మా అమ్మ సినిమా’ అంటూ గొప్పగా చెప్పుకోవాలి..!!

Chennai Love Story!

has Pooja Hegde Agreed To Arrange Marriage?