in

Trisha replaces Nayanthara in Chiranjeevi’s Lucifer remake!

కప్పటి హీరోయిన్లు రాధ, రాధిక, విజయశాంతిలు చిరు జోడిగా ఎన్నో సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. అప్పటి హీరోయిన్‌లంతలా కాకపోయినా ఇప్పటి తరంలో… ఓ హీరోయిన్‌ చిరు సరసన నటించి మంచి పేరుతెచ్చుకుంది. ఇప్పుడు మరో సారి చిరు సినిమాలో అవకాశం కొట్టేసింది ఇంతకు ఆ భామ ఎవరనుకుంటున్నారా ..2006లో మెగాస్టార్‌ హీరోగా మురుగదాస్‌ డైరెక్షన్‌లో రిలీజైన చిత్రం ‘స్టాలిన్’‌. ఈ సినిమాలో మెగాస్టార్ కు జోడీగా త్రిష నటించి మంచి పేరు తెచ్చుకుంది.

మళ్లీ 15 సంవత్సరాల తరువాత అదే త్రిష మెగాస్టార్‌ చిరంజీవి పక్కన ‘లూసిఫర్‌’ తెలుగు రీమేక్‌ లో నటించనుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. మలయాళం లో సూపర్ హిట్ అయిన లూసిఫర్ ను తెలుగులో మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మెగాసటర్ క్రేజ్ దృష్టిలో పెట్టుకొని సినిమాలో కొన్ని మార్పులు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమా లో హీరోయిన్ గా పలువురిపేర్లు వినిపించాయి. మొదట్లో నయనతార పేరు గట్టిగా వినిపించింది. ఇప్పుడు త్రిష పేరు తెరపైకి వచ్చింది.

pawan kalyan gives green signal to bahubali writer?

rumors viral about vaishnav tej’s first remuneration!