in

Trisha Emerges Out As The Highest-Paid Actress In South?

నాలుగు పదుల వయసులో హీరోయిన్లకు డిమాండ్ ఉండటం చాలా అరుదు. ఒకప్పుడు జయసుధ విజయశాంతి కాలంలో చెల్లుబాటు అయిందేమో కానీ ఇప్పటి ట్రెండ్ అభిరుచులే వేరు. కానీ త్రిష మాత్రం దానికి భిన్నంగా క్రేజీ ఆఫర్లు స్వంతం చేసుకోవడమే కాక రెమ్యునరేషన్ పరంగానూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. చెన్నై టాక్ ప్రకారం కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్ లో రూపొందబోయే థగ్ లైఫ్ కు గాను అక్షరాలా పన్నెండు కోట్ల పారితోషికం తీసుకుందట.

అంటే విజయ్ తో చేసిన లియోకి ఇప్పటికి తీసుకునే మొత్తం రెట్టింపు అయ్యిందన్న మాట. డిమాండ్ అలా ఉంది మరి..విజయ్ సేతుపతితో చేసిన 96 బ్లాక్ బస్టర్ అయినా త్రిషలో ఇంకా గ్లామర్ తగ్గలేదని నిరూపించింది మాత్రం పిఎస్ 1,2లే. కుందవైగా అందులో ఆమెని చూసి తినేది అన్నమా లేక అందమా అనే కామెంట్లు వినిపించాయి..దానికి తగ్గట్టే త్రిష సెకండ్ ఇన్నింగ్స్ మాములు జోరుతో కనిపించడం లేదు..!!

Pooja Hegde and Naga Chaitanya to reunite after 10 years?

vijay devarakonda rejected top heroine for mrunal thakur?