10. NARESH
తన కెరీర్ మొదటి నుంచి హీరో నరేష్ ను ఇప్పటి వరకు అందరు అల్లరి నరేష్ అనే పిలుస్తూ వచ్చారు. కానీ రీసెంట్ గా “నాంది” సినిమా తో ఆయన కొత్త గా కనిపించి “నాంది” నరేష్ అని పిలిపించుకుంటున్నారు. నాంది సినిమా నరేష్ గారి సినీ జీవితం సెకండ్ ఇన్నింగ్స్ కు నాంది పలికిందని చెప్పాలి.
09. RAVI TEJA
మాస్ సినిమాలకు పెట్టింది పేరైన రవితేజ ను మొదట్లో అంత ‘మాస్ హీరో’ అని పిలుచుకునే వారు. హరీష్ శంకర్ తో తీసిన “మిరపకాయ్” సినిమా నుంచి రవితేజ ను ‘మాస్ మహారాజ్’ గా పిలవడం స్టార్ట్ చేసారు..ఇక దీని తరువాత అతను అన్ని మాస్ కమర్షియల్ సినిమాలు మాత్రమే తీయడం విశేషం.
08. NAGARJUNA
అక్కినేని నాగేశ్వరావు గారి వారసుడిగా ఎంట్రీ ఇచ్చారు హీరో నాగార్జున, కెరీర్ మొదట్లో యువసామ్రాట్ అనే బిరుదు ఉండేది. ఆ తరువాత “కింగ్” సినిమా నుంచి ఆయనను కింగ్ నాగార్జున అని పిలవడం మొదలుపెట్టారు. కింగ్ అంటే నాగార్జున..నాగార్జున అంటే కింగ్ అయినట్టు అయిపోయింది ఇప్పుడు.
07. JR NTR
జూనియర్ ఎన్టీఆర్ ను ఆయన అభిమానులు యంగ్ టైగర్ అంటూ ముద్దు గా పిలుచుకుంటుంటారు. శక్తీ సినిమా తో ఆయనకు ఏ 1 స్టార్ అనే బిరుదు కూడా ఆడ్ అయింది.. కానీ.. ఆయన అభిమానులు ఇప్పటికీ యంగ్ టైగర్ అనే పిలుచుకుంటుంటారు. కొత్త బిరుదు వచ్చిన మళ్ళి పాత బిరుదుతోనే పిలవబడుతున్నాడు జూనియర్.
06. ALLU ARJUN
నిన్న మొన్నటి వరకు.. అల్లు అర్జున్ ని స్టయిలిష్ స్టార్ అని పిలుస్తూ వచ్చాం.. కానీ తాజాగా.. ఆయన హీరో గా నటిస్తున్న పుష్ప సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్ లో అల్లు అర్జున్ కి తన దర్శకుడు సుకుమార్ ‘ఐకాన్ స్టార్’ అనే బిరుదుని ఆడ్ చేసారు. సో..అల్లు అర్జున్ ఇక నుండి స్టైలిష్ స్టార్ కాదన్నా మాట.
05. MAHESH BABU
మహేష్ బాబు ను ఆయన కెరీర్ ప్రారంభం లో ప్రిన్స్ అని పిలిచేవారు. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్ డైరెక్షన్ లో వచ్చిన ఇండస్ట్రీ హిట్ “పోకిరి” సినిమా తరువాత నుంచి ఆయనను సూపర్ స్టార్ అని పిలుస్తున్నారు. టైటిల్ కు తగట్టే అప్పటినుండి సూపర్ క్రేజ్ సంపాదించి నిజంగా సూపర్ స్టార్ అయ్యాడు మన మహేష్.
04. PRABHAS
ఆరడుగుల అందగాడు ప్రభాస్ ను మొదట్లో అందరూ డార్లింగ్ అనీ, యంగ్ రెబెల్ స్టార్ అని పిలిచేవారు. రాజమౌళి బాహుబలి తరువాత పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ ను ఇప్పుడు ప్రపంచం అంత ‘రెబెల్ స్టార్’ అని పిలుస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ఇప్పటికి డార్లింగ్ అనే పదం తరుచు వాడుతూ ఉంటాడు..బహుశా అతనికి అదే ఇష్టం ఏమో..ఏమంటారు డార్లింగ్స్..
03. BALAKRISHNA
నందమూరి హీరో బాలకృష్ణ కు మొదట్లో ‘యువరత్న’ అనే బిరుదు ఉండేది. వరుస హిట్ లు తరువాత.. నందమూరి బాలకృష్ణను ఆయన అభిమానులు ‘నటసింహం’ అనే మరో పేరుతొ పిలుచుకుంటున్నారు. బాలకృష్ణను సింహ సినిమా నుంచి నటసింహం అని పిలుచుకుంటున్నాం..’సింహ’ అనే పదం తో బాలయ్య సినిమా టైటిల్స్ చాల రావడం విశేషం.
02. KRISHNA
మాస్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న హీరో కృష్ణ గారిని మొదట్లో “నటశేఖర” అనే బిరుదుతో పిలిచేవారని చాల తక్కువ మందికి తెలుసు. ఆ తరువాత ఆయనను “సూపర్ స్టార్” అని పిలవడం మొదలుపెట్టారు. “సింహాసనం” అనే సినిమా నుంచి కృష్ణ గారిని ఆరోజు నుండి ఇప్పటివరకు సూపర్ స్టార్ అనే పిలుస్తున్నారు.
01. CHIRANJEEVI
చిరంజీవికి సినిమా ప్రపంచానికి ఎనలేని సంబంధం ఉంది. చిరు కెరీర్ మొదట్లో.. ఆయనను డైనమిక్ హీరో అని పిలుచుకునే వారు. ఆ తరువాత ఆయనకు సుప్రీం హీరో అనే బిరుదును ఇచ్చారు. తరువాత కలం లో “మరణ మృదంగం” సినిమా నుంచి ఆయనను మెగాస్టార్ అని పిలుస్తూ వస్తున్నారు..ఇప్పుడు ఇండస్ట్రీకు ఒక పెద్దన్న లాగా అందరివాడు అయ్యాడు చిరంజీవి..