in

Tollywood Actresses showing interest in peppy item numbers!

కప్పుడు స్పెషల్‌ సాంగ్స్‌ చేయడానికి ప్రత్యేకంగా తారలు ఉండేవారు. ఇప్పుడు స్టార్‌ హీరోయిన్లు, హీరోయిన్లు కూడా చేస్తున్న విషయం తెలిసిందే. కెరీర్‌లో తొలిసారి సమంత ఒక స్పెషల్‌ సాంగ్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇప్పటివరకూ ఈ బ్యూటీ యాభైకి పైగా సినిమాలు చేశారు. ఫస్ట్‌ టైమ్‌ సమంత స్పెషల్‌ సాంగ్‌లో కనిపించనుండటం విశేషం. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప’లోనే సమంత ప్రత్యేక పాటలో కనిపించనున్నారు.

సేమ్‌ టు సేమ్‌ సమంతలానే హీరోయిన్‌ రెజీనా తన కెరీర్‌లో ఫస్ట్‌ టైమ్‌ స్పెషల్‌ సాంగ్‌ చేశారు. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘ఆచార్య’లోనే రెజీనా స్పెషల్‌ సాంగ్‌ చేశారు. అయితే ఇది రెగ్యులర్‌ స్పెషల్‌ సాంగ్‌లానో, ఐటమ్‌ సాంగ్‌లానో ఉండదని తెలిసింది. ఇంకోవైపు బుల్లితెర ఫేమస్‌ యాంకర్, నటి రష్మీ గౌతమ్‌ ‘బోళా శంకర్‌’ చిత్రంలో ఓ మాస్‌ మసాలా సాంగ్‌లో చిరంజీవితో కలిసి స్టెప్పులేశారు. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలిగా కీర్తీ సురేష్‌ కనిపిస్తారు.

ఇప్పటికే తమన్నా అరడజను స్పెషల్‌ సాంగ్స్‌లో స్టెప్పులు వేశారు..తాజాగా ‘గని’ కోసం మరోసారి స్పెషల్‌గా మాస్‌ స్టెప్పులేశారని తెలిసింది. వరుణ్‌ తేజ్‌ హీరోగా కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. మరోవైపు యంగ్‌ హీరోయిన్‌ ఫరియా అబ్దుల్లా (‘జాతి రత్నాలు’ ఫేమ్‌) ‘బంగార్రాజు’ చిత్రంలో నాగార్జునతో కలిసి ఓ స్పెషల్‌ సాంగ్‌లో కనిపించనున్నారు. ఇందులో నాగచైతన్య, కృతీశెట్టి ఓ జంటగా నటిస్తున్నారు..

payal rajput new stills in knee length dress!

top 10 Tollywood star heroes whose Title got changed!