in

top 10 sports based movies!

10. GOLCONDA HIGH SCHOOL   

క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ సినిమా మనల్ని మళ్ళి స్కూల్ డేస్ లోకి తీసుకెళ్తుంది,తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా బాగా ఆడింది. సుమంత్ ఇందులో క్రికెట్ కోచ్ పాత్రను పోషించడం విశేషం.

09. KABADI KABADI

బాడీ కబాడీ’, జగపతి బాబు ఇంకా కళ్యాణి గారు కలిసి నటించిన ఈ సినిమా ఊహించని విదంగా మంచి విజయాన్ని సాధించింది. లవ్, కామెడీ , ప్రధానంగా కబాడీ బ్యాక్ డ్రాప్ తో సాగే ఈ సినిమా అందర్నీ నవ్విస్తూ మెప్పిస్తుంది. చిన్న సినిమాల్లో ఈ జోనర్ లో వచ్చిన సినిమాల్లో కాళ్ళ ఈ సినిమా మంచి కలెక్షన్స్ తో టాప్ ప్లేస్ లో నిలిచింది.

08. GURU

బాక్సింగ్ డ్రామాలో విక్టరీ వెంకటేష్ రితికా సింగ్ కు కోచ్ పాత్రలో నటించారు. ఈ చిత్రం క్రీడా రంగంలో మరియు వెలుపల అనేక సమస్యలతో వ్యవహరిస్తుంది. రాజకీయ జోక్యం నుండి లైంగిక వేధింపుల వరకు, సుధ కొంగర బాక్సర్ జీవితంలో సాధ్యమయ్యే ప్రతిదాన్ని తీసుకరావడం జరిగింది.

07. OKKADU

క్కడు’ సినిమా సందేహం అనేదే లేకుండా, మహేష్ కు స్టార్ డం తెచ్చి సూపర్ స్టార్ గ మార్చిన సినిమా అని చెప్పవచ్చు. కక్ష నేపథ్యంలో ఏర్పడిన ఈ గుణశేకర్ రేసీ ఎంటర్టైనర్ కబడ్డీ ఆటగాడి కథను చెబుతుంది. ఈ చిత్రం నాలుగు నంది అవార్డులతో పాటు నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను పొందడం విశేషం.

06. BADRACHALAM

రియల్ స్టార్ శ్రీహరి గారిని జపాన్ దేశం నుండి వచ్చిన ఫైటింగ్ గేమ్ ‘తైక్వాండో’ ఛాంపియన్‌గా, విజయ్ చందర్‌ను తన గురువుగా చూపించిన భద్రాచలం, అతను / ఆమె సరైన కోచ్‌ను కనుగొంటే క్రీడాకారుడు ఏ ఎత్తుకు చేరుకోగలడో అన్న విషయాలని కళ్ళకు కట్టినట్టు చూపించిన సినిమా ఇది.

05. AMMA NANNA O TAMIL AMMAI

చిత్రం ప్రధానంగా తల్లి-కొడుకు సంబంధం గురించి ఉన్నప్పటికీ, కిక్‌బాక్సింగ్ కీలకమైన అంశం. ఇది మరొక ఓవర్‌ డ్రామాటిక్ సెంటిమెంట్ తెలుగు చిత్రంగా మారింది. ఈ చిత్రం యొక్క ఆత్మ కిక్‌బాక్సింగ్ క్రీడలో ఉంది, ఇది లీడ్ యొక్క విడిపోయిన తల్లిదండ్రుల జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

04. BHEEMLI

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన రియలిస్ట్ మూవీ ఇది, కబాడీ ఆట నేపథ్యంలో సాగె ఈ సినిమా అందరి హృదయాలను కలిచివేస్తుంది. ఎలాగైనా కప్ గెలిచి తమ ఊరికి తీరిగి రావాలని కోరుకొనే ఒక కబాడీ జట్టు కదా ఇది. ఇందులో నటించిన వారంతా నిజంగా తమ పాత్రలకు ప్రాణం పోసి నటించారు అందుకే ఈ సినిమా ఒక గొప్ప విజయాన్ని సాధిచింది.

03. THAMMUDU

మీర్ ఖాన్ యొక్క 1992 బాలీవుడ్ చిత్రం ‘జో జీతా వోహి సికందర్’ కు తెలుగు రీమేక్ గ వచ్చిన సినిమా, తమ్ముడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు భారీ అభిమానులను సృష్టించింది. సరదా ఇంకా సీరియస్ నెస్ కలిగి ఉన్న లక్కీ వ్యక్తి సుబ్రమణ్యం యొక్క కథను ఆధారంగా తీసింది, అతను కిక్‌బాక్సింగ్ పట్ల క్రమశిక్షణతో నిబద్ధత కలిగి ఉంటాడు, అతను ఎలా విజేతగా నిలిచాడు అనేది ఈ కథ.

02. SYE

రాజమౌలి గారు తీసిన మూడవ చిత్రం ‘సై’, టాలీవుడ్లో ఇప్పటివరకు చేసిన ఉత్తమ క్రీడా చిత్రాలలో ఒకటి. రగ్బీ ఆట చుట్టూ తిరిగే సినిమా ఇది… ఒక కళాశాల యొక్క రెండు ప్రత్యర్థి విద్యార్థి సమూహాలను ఏకం చేస్తుంది.. మరియు చివరికి వారి సాధారణ శత్రువుపై విజయం సాధిస్తుంది. ఈ చిత్రాన్ని తరువాత డబ్ చేసి మలయాళంతో పాటు హిందీలో లో కూడా నిర్మించారు..అన్ని బాషలలో ఇది గణ విజయం సాధించింది.

01. JERSEY

మధ్య కాలంలో స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన బెస్ట్ మూవీ జెర్సీ అనే చెప్పాలి, ఒక క్రికెటర్ జట్టులో సెలెక్ట్ అవ్వడానికి ఎన్ని కష్టాలు పడుతాడు, రాజకీయంగా మరియు వయసు పరంగా ఎలాంటి కఠినమైన పరిస్థితుల్ని ఎదురుకుంటాడు అనే విషయాలను జెర్సీ ద్వారా మనం చూడవచ్చు.

Honeybees attacks on chiru and charan!

pattu vadhalani vikramarkudu ‘nagarjuna’!