in

TOP 10 ROLES OF SAMANTHA!

10. PRASANTHI IN ‘DHOOKUDU’

దూకుడుఏ మాయ చేసావే త‌ర్వాత స్టార్ హీరోయిన్ గా అడుగులు వేయ‌డానికి.. కెరీర్ లో మ‌రో స్టెప్ ముందుకు వేయ‌డానికి సాయ‌ప‌డిన సినిమా దూకుడు. మ‌హేష్ బాబు హీరోగా శ్రీనువైట్ల తెర‌కెక్కించిన ఈ చిత్రం రికార్డులు క్రియేట్ చేసింది. ఈ చిత్రంతో క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్ గా కూడా మారిపోయింది స‌మంత‌. అంతేకాదు గ్లామ‌ర్ షోలో కూడా త‌న‌కెలాంటి అభ్యంత‌రాలు లేవ‌ని దూకుడు సినిమాతోనే నిరూపించింది ఈ ముద్దుగుమ్మ‌

09. MADHURAVANI IN ‘MAHANATI’

‌హాన‌టి మ‌హాన‌టితో కీర్తిసురేష్ హీరోయిన్ అయినా కూడా క‌థ‌ను ముందుకు న‌డిపించ‌డంలో స‌మంత‌ది కూడా అంతే కీల‌క‌మైన పాత్ర‌. ఈ చిత్రంలో మధుర‌వాణి పాత్ర‌లో న‌టించింది ఈ ముద్దుగుమ్మ‌. ఓ వైపు సావిత్రి పాత్ర గురించి చెబుతూనే మ‌రోవైపు త‌న ప్రేమ‌క‌థ‌ను కూడా చూపిస్తుంది స‌మంత‌. ఈ సినిమా విజ‌యం సాధించ‌డంలో స‌మంతతో పాటు విజ‌య్ దేవ‌ర‌కొండ పాత్ర కూడా కీల‌క‌మే.

08. PRIYA / KRISHNAVENI IN ‘MANAM’

‌నం స‌మంత కెరీర్ లో ఎప్ప‌టికీ నిలిచిపోయే ప్ర‌త్యేక‌మైన చిత్రం మ‌నం. అక్కినేని కుటుంబం అంతా క‌లిసి ఈ సినిమాలో న‌టించింది. అప్ప‌టికి అక్కినేని కోడ‌లు కాక‌పోయినా ఆ త‌ర్వాత మాత్రం అదే ఇంటికి కోడ‌లిగా వెళ్లింది ఈ భామ‌. దాంతో మ‌నం సినిమా ఈమెకు ఎప్ప‌టికీ ప్ర‌త్యేక‌మే. పైగా ఈ చిత్రంలో అద్భుత‌మైన న‌ట‌న క‌న‌బ‌ర్చి సినిమా విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించింది స‌మంత‌.

07. ANASUYA RAMALINGAM IN ‘A AA’

..ఆ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కు ఒక్క‌సారి హీరోయిన్ న‌చ్చిందంటే అంత ఈజీగా వ‌ద‌ల‌డు. స‌మంత‌ను కూడా అంతే. ఈయ‌న కూడా స‌మంత‌కు వ‌ర‌స సినిమాల్లో అవ‌కాశం ఇచ్చాడు. అత్తారింటికి దారేది త‌ర్వాత స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి కూడా క‌లిసి ప‌నిచేసారు ఈజోడీ. ఇక అ..ఆ సినిమా అయితే పూర్తిగా లేడీ ఓరియెంటెడ్ అయిపోయింది. అందులో నితిన్ హీరోగా న‌టించినా కూడా స‌మంత వ‌ల్లే సినిమాకు అంత క్రేజ్ వ‌చ్చింది.

06. BINDU IN ‘EEGA’

గ స‌మంత కెరీర్ కొత్తలో ఎక్కువ‌గా న‌ట‌న‌కు స్కోప్ ఉన్న పాత్ర‌లే చేసింది. అలాంటి పాత్ర‌ల్లో ఈగ సినిమా కూడా ఒక‌టి. ఈ చిత్రంలో ఆమె చేసిన ఇందు కారెక్ట‌ర్ కు చాలా మంది పేరు వ‌చ్చింది. రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఈ సినిమాలో నానితో క‌లిసి రొమాన్స్ చేసింది ఈ ముద్దుగుమ్మ‌. ఈగ కూడా స‌మంత కెరీర్ ను మార్చేసిన సినిమాల్లో ఒక‌టి.

05. RACHANA IN ‘U TURN’

లేడీ ఓరియెంటెడ్ సినిమాగా వచ్చిన ‘యూటర్న్‌’ విజయం సాధించింది. రచన అనే జర్నలిస్టుగా సామ్‌ కనిపించి, ప్రశంసలు అందుకున్నారు. రోడ్డుపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల జరిగే పరిణామాలు, వాటి వల్ల కుటుంబ సభ్యులుపడే బాధల నేపథ్యంలో సాగే చిత్రమిది. కథ మొత్తం దాదాపు రచన చుట్టూ తిరుగుతుంది. ఆది పినిశెట్టి, రాహుల్‌ రవీంద్రన్‌, భూమిక కీలక పాత్రలు పోషించారు..సింపుల్ స్టోరీ ను సీరియస్ ఇష్యూ గ చూపించి మంచి విజయాన్ని సాధించారు.

04. SWATHI IN ‘OH BABY’

పైకి అందమైన యువతిలా కనిపిస్తూ నటిస్తున్నది వృద్ధురాలన్న సంగతి గుర్తుపెట్టుకుని చేయడం అంత సులభమేమీ కాదు. నడక, మాట తీరు, చేష్టలు.. అన్నింటిలోనూ పర్ఫెక్ట్ గ ఉండాలి . లేకపోతే సన్నివేశం పండదు, ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు . ఈ విషయంలో సమంత వంద శాతం సక్సెస్‌ అయ్యారు. ‘ఓ బేబీ’ సినిమాలో సీనియర్‌ నటి లక్ష్మిగా పలికించే హావభావాలతో ఫిదా చేశారు. కొరియన్‌ సినిమా ‘మిస్‌గ్రానీ’కి రీమేక్‌ ఇది. నందినిరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సామ్‌ నటన హైలైట్‌గా నిలిచిందని విమర్శకులు ప్రశంసల జల్లు కురిపించారు.

03. SHRAVANI IN ‘MAJILI’

ర్తంటే ఆమెకు ప్రాణం.. కానీ భార్యపై కొంచెం కూడా ఇష్టం లేదా భర్తకు. అతడిలో ఎప్పటికైనా మార్పు వస్తుందని ఆశిస్తూ అలానే జీవితాన్ని గడిపేస్తుంటుంది. ఈ కథాంశంతో పెళ్లి తర్వాత సామ్‌-చైతన్య కలిసి నటించిన సినిమా ‘మజిలీ’. 2019లో వచ్చిన ఈ చిత్రం అభిమానులకు ట్రీట్‌ ఇచ్చింది. శ్రావణి అనే సాధారణ అమ్మాయిగా సామ్‌ అలరించారు. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కూడా విజయం సాధించింది.

02. JESSI IN ‘YMC’

ప్రపంచంలో ఇంత మంది అమ్మాయిలుండగా నేను జెర్సీనే ఎందుకు ప్రేమించాలి.. అని ‘ఏ మాయ చేసావె’లో నాగచైతన్య తనను తానే ప్రశ్నించుకుంటారు. కథానాయికగా సమంత తొలి సినిమా ఇది. అరంగేట్రంతోనే అందరి మనసులో దోచేశారు. పక్కింటి అమ్మాయి అనిపించుకున్నారు. దీనికి తోడు ఈ సినిమాలో ఆమెకు చిన్మయి చెప్పిన డబ్బింగ్‌ పాత్రకు మరింత బలాన్ని చేకూర్చింది.

01. RAMALAKSHMI IN ‘RANGASTHALAM’

ప్పటి వరకు గ్లామర్‌, మోడ్రన్‌గా కనిపించిన సామ్‌ ‘రంగస్థలం’ సినిమాతో ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేశారు. పల్లెటూరి అమ్మాయి రామలక్ష్మిగా డీగ్లామర్‌ పాత్రలో నటించి శభాష్‌ అనిపించుకున్నారు. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రామ్‌చరణ్‌ వినికిడి లోపం ఉన్న పాత్రలో నటించారు. ఈ చిత్రం సామ్‌ కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.

cricketer David Warner tik-tok video on butta bomma song!

niharika special dance video!