in

pattu vadhalani vikramarkudu ‘nagarjuna’!

అక్కినేని నాగార్జున గారు, అనుకోకుండా నటుడు అయ్యారు, అమెరికా లో ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని వచ్చిన నాగార్జున గారు, వారి సోదరుడు వెంకట్ గారి తో కలసి సినిమా ప్రొడ్యూస్ చేయాలని చాలామంది ని అప్రోచ్ అయ్యారు కానీ అందరు వాళ్ళను లైట్ గ తీసుకున్నారు. వెంకట్ గారు, ఎవరో ఎందుకు నువ్వే చేయవచ్చు కదా అన్న తరువాత, నాగార్జున గారు వెళ్లి తాను నటించాలనుకున్నట్లు నాగేశ్వర రావు గారితో చెప్పగానే వారి కళ్ళలో నీళ్లు తిరిగాయి, తన నట వారసత్వాన్ని నిలబెట్టేవాడు వచ్చినందుకు. కానీ నువ్వు నాగేశ్వర రావు కొడుకు అయినంతమాత్రాన జనం చూడరు, నీ కృషి ఉండాలి” గో ఎహెడ్” అన్నారు,” విక్రమ్” సినిమా తో నట ప్రస్థానం మొదలయ్యింది.

వరుసగా 7 సినిమాలు చేసారు హిట్ అవుతున్నాయి కానీ తనకు గుర్తింపు రావటం లేదు. అటువంటి సందర్భం లో మణిరత్నం గారి” మౌన రాగం” సినిమా చూసి మణి గారి డైరెక్షన్ లో ఒక మూవీ చేయాలి అని ఆశగా ఆయనను కలిస్తే, నాకు తెలుగు రాదు నేను తెలుగు మూవీ చేయను “ముడియాదే” అని చెప్పేసారు.ఒక్క సారిగా నిస్పృహ, నాగార్జున గారు పట్టు వదలని విక్రమ్ (విక్రమార్కుడు) లాగా, ఒక 10 రోజులు క్రమం తప్పకుండా ఉదయం 7 గంటలకు మణిరత్నం గారి ఇంటి ముందు ఉండేవారు,వాకింగ్ కి వెళుతున్న ఆయనను మళ్ళీ, మళ్ళీ అడగటం తో, నాగార్జున గారి పట్టుదల నచ్చిన మణిగారు. సరే ఒక నెల టైం ఇవ్వు అని, నెల తరువాత కలిసిన నాగార్జున గారికి” గీతాంజలి” కథ చెప్పారట, ఆ సినిమా ని 32 రోజుల్లు పూర్తి చేసారు. నాగార్జున గారి కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా తయారవటం వెనుక ఇంత కథ ఉంది. నాగేశ్వర రావు గారి సినిమా లో ఒక పాట లో శ్రీ శ్రీ గారు చెప్పినట్లు ” ఏది తనంత తానే నీ దరికి రాదు, శోధించి సాధించాలి అదియే ధీర గుణం” అనేందుకు నిదర్శనము, నాగార్జున గారి పట్టుదల దాని ద్వారా వారు పొందిన అనుభవం. గీతాంజలి నాగార్జున గారికే కాకా ప్రేక్షకులకు కూడా ఒక అనుభూతి ని మిగిల్చింది.

top 10 sports based movies!

nayanthara shocking comments!