in

TOP 10 MOST VIEWED TRAILERS OF TOLLYWOOD IN 2021!

10. PELLI SANDHADI  

త 25 ఏళ్ల క్రింద ఇదే ‘పెళ్లి సందడి’ పేరుతో సినిమా తీసి రికార్డులు తిరగరాసిన రాఘవేంద్ర రావు.. ఇప్పుడు మోడ్రన్ ‘పెళ్లి సందD’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు..శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా..శ్రీలీల హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ అయ్యారు. ఇక ట్రైలర్‌లో రోషన్, శ్రీలీల మధ్య రొమాన్స్, ఆ తర్వాత యాక్షన్ సన్నివేశాలు, కీరవాణి అందించిన మ్యూజిక్ హైలైట్‌గా నిలిచాయి..మంచి కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమాకు ప్రెసెంట్ 10 మిలియన్ వ్యూస్ ఉన్నాయి.

09. MOST ELIGIBLE BACHELOR

ఎంతోకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ కు ఈ చిత్రం ఆ దాహాన్ని తీర్చిందనే చెప్పాలి.. లవ్‌, కామెడీ అంశాలతో ఆసక్తిగా రేకెత్తించగా..అఖిల్, పూజా హెగ్డే జోడీ స్క్రీన్ ఫెయిర్ బాగుంది. మ్యారీడ్‌ లైఫ్‌ బాగుండాలంటే కెరీర్‌ బాగుండాలి అంటూ అఖిల్ చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. పూజా హెగ్డే, అఖిల్ కు పూర్తి భిన్నంగా ఉన్నట్లు ట్రైలర్ లో చూపించారు. ఇక ట్రైలర్ మధ్యలో ఫరియా, ఈషా రెబ్బా కనిపించారు..దీనికి ప్రెసెంట్ 11 మిలియన్ వ్యూస్ ఉన్నాయి.

08. LOVE STORY

మీడియం రేంజ్ మూవీస్ పరంగానే కాదు టాప్ ట్రైలర్ ల రికార్డుల విషయంలో కూడా ఒకటిగా నిలుస్తూ సంచలనం సృష్టిస్తుంది. ఈ ట్రైలర్ రిలీజ్ అయిన 1 గంటలోనే 1 మిలియన్ రియల్ టైం వ్యూస్ మార్క్ ని అందుకోగా టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోలలో…ఫాస్టెస్ట్ 50 వేల లైక్స్ ని ఇది వరకు నాని ‘వి’ మూవీ 47 నిమిషాల్లో అందుకుంటే ఇప్పుడు లవ్ స్టొరీ 36 నిమిషాల్లో ఆ రికార్డ్ అందుకుంది..ప్రెసెంట్ ఈ ట్రైలర్ కు 14 మిలియన్ వ్యూస్ ఉన్నాయి.

07. JATHI RATNALU

ప్రభాస్ ఈ ట్రైలర్ ను విడుదల చేశారు. 2 నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్.. స్టార్టింగ్ నుండీ ఎండింగ్ వరకూ ఫుల్ ఫన్ తో కూడుకుని ఉంది. దాంతో సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆసక్తిని ప్రేక్షకులకు కలుగజేసింది ట్రైలర్. అంతేకాదు యూట్యూబ్ లో కూడా అసాధారణమైన రికార్డులను నెలకొల్పింది. ఇక తక్కువ టైంలో అత్యధిక లైకులను సాధించిన టీజర్ గా జాతి రత్నాలు రికార్డు సృష్టించింది..ఈరోజు వరకు ఈ హిట్ సినిమా ట్రైలర్ కు 21 మిలియన్ వ్యూస్ ఉన్నాయి.

06. KRACK

వితేజ – గోపీచంద్ మలినేని కలయికలో రూపొందిన చిత్రం ‘క్రాక్’ హాట్ ట్రిక్ విజయం కొట్టిన విషయం తెలిసిందే. నూతన సంవత్సర కానుకగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది..మరీ ముఖ్యంగా మాస్ ఆడియెన్స్‌ను ఈ ట్రైలర్ బాగా ఆకట్టుకుంది. ఫలితంగా ఇది 24 గంటల్లోనే  7 మిలియన్ వ్యూస్ సాధించి, రవితేజ కెరీర్‌లోనే బెస్ట్ ట్రైలర్‌గా రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు, దీనికి ఇప్పటివరకు నాలుగు లక్షలకు పైగా లైకులుతో 24 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

05. UPPENA

వైష్ణవ్ తేజ్ తొలి సినిమా ‘ఉప్పెన’ విడుదలైన నెల రోజులకే ఎన్నో రికార్డులు తిరగరాసింది..ఈ ఇయర్ లో100 కోట్ల క్లబ్బులో చేరిన మొదటి చిత్రం కూడా ఇదే. కృతి శెట్టి హీరోయిన్‌గా పరిచయమైన ఈ సినిమాను బుచ్చిబాబు తెరకెక్కించాడు. ఉప్పెన ఖాతాలో ఇప్పటికే చాలా రికార్డులు చేరిపోయాయి..తొలిరోజు హైయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన డెబ్యూ హీరోగా వైష్ణవ్ తేజ్ రికార్డ్: 10.32 కోట్లు షేర్..ప్రెసెంట్ ఈ సినిమా ట్రైలర్ కు 29 మిలియన్ వ్యూస్ దక్కాయి.

04. AKHANDA

సింహా’, ‘లెజెండ్’ సినిమాల్లో బాలయ్యను నెవర్ బిఫోర్..ఎవర్ ఆఫ్టర్ అన్నట్లు చూపించి..ఇలా చూపిస్తే ఎందుకు చూడరంటూ..బాలయ్య నట విశ్వరూపానికి రెండుసార్లు నంది అవార్డులు పొందేలా చేశారు ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను..మరి వీళ్లిద్దరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ హిట్ గ వచ్చింది ‘అఖండ’. రిలీజ్ చేసిన అతి తక్కువ టైంలో 2 మిలియన్ వ్యూస్ అండ్ లైక్స్‌తో ట్రెండ్ అయిన ఈ ట్రైలర్ కు ప్రెసెంట్ 32 మిలియన్ వ్యూస్ ఉన్నాయ్.

03. PUSHPA

మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ నుంచి అతి భారీ చిత్రాలు తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. దీనికి కారణం మన సినిమా స్థాయి ప్రపంచ వ్యాప్తం కావడంతో పాటు టాలీవుడ్ హీరోల స్టామినా కూడా అంతకంతకూ పెరుగుతూ ఉండడమే..అందులో రీసెంట్ గ రిలీస్ అయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ ‘పుష్ప’ ఒకటి. క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ను ఇప్పటికే 39 మిలియన్ మంది చూసారు.

02. RRR

బాహుబలి లాంటి వండర్‌ తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్‌.ఆర్‌.ఆర్‌ చిత్రం కోసం యావత్‌ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. దేశంలోని దాదాపు అన్ని భాషలతో పాటు ఇతర దేశాల్లోనూ ఈ సినిమా జనవరి 7న విడుదల కానుంది..ఇక తాజాగా చిత్ర యూనిట్‌ విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌ ఒక్కసారిగా అంచనాలను ఆకాశాన్ని పెంచేశాయి..ప్రస్తుతం ఈ ట్రైలర్ ను 42 మిలియన్ మంది అప్పుడే చూసేసారు..

01. VAKEEL SAAB

వన్ కళ్యాణ్ సినిమా అంటేనే రికార్డులకు కేరాఫ్ అడ్రస్. ఆయన సినిమా వస్తుందంటే పండగ చేసుకోడానికి సిద్ధంగా ఉంటారు అభిమానులు. అంతేకాదు పవన్ కోసం అభిమానులు రికార్డులు అలా ఇచ్చేస్తుంటారు..ఇప్పుడు కూడా ఇదే జరిగింది…పవర్ స్టార్ ‘వకీల్ సాబ్’ సినిమా ట్రైలర్ ఊహించినట్లుగా ఆల్ టైమ్ రికార్డులు క్రియేట్ చేస్తుంది..ప్రస్తుతం ఈ ట్రైలర్ కు 47 మిలియన్ వ్యూస్ ఉన్నాయ్.

 

Trisha Latest Spicy Stills in White Dress!

upasana konidela has created a rare record, gets uae golden visa!