10. ఆఫీసర్
రామ్ గోపాల్ వర్మ ప్రొడ్యూస్ చేసిన ఆఫీసర్ కి కనీసం సినిమా లొ వాడిన గన్స్ అండ్ కస్టమ్స్ కోసం ఖర్చుపెట్టిన డబ్బులు కూడా రాలేదు..దీనిబట్టి మీరే అర్ధం చేసుకోండి ఫాన్స్ అండ్ క్రిటిక్స్ ఈ సినిమా ని ఎంత ట్రోల్ చేసారు అనేది.
09. అజ్ఞాతవాసి
ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయ్యిన ఈ సినిమా కూడా విమర్శలను ఎదురుకున్నది.
08. అమర్ అక్బర్ ఆంటోనీ
రవితేజ శ్రీను వైట్ల కాంబినేషన్ అనగానే సినిమా పైన బీబాత్సమైన అంచనాలు ఏర్పడ్డాయి. కట్ చేస్తే సినిమా అట్టర్ ఫ్లాప్ , ఫుల్ గా ట్రోల్ అయ్యింది..
07.రెబెల్
మన డార్లింగ్ కెరీర్ లోనే పెద్ద డిసాస్టర్ గా నిలించింది రెబెల్.సినిమాలో ఉన్న ప్రతీ దానిని ట్రోల్ చేశారు.
06. షాడో
మన మెహర్ రమేష్ నుండి వచ్చిన మూడవ ఆణిముత్యం ఇది.అసలు థియేటర్ కి ఎందుకు వచ్చాము రా అయ్యా అని అనుకునేలా చెయ్యడం మన మెహర్ అన్న కే సాధ్యం మరీ !
05. బద్రినాథ్, వరుడు
ఈ రెండు సినిమా స్టోరీలు పక్కన పెడితే కొన్ని సీన్లు ఉంటాయి… స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఏం సీన్స్ రా బాబు దండం అనేలా ఉంటాయి.
04. శక్తి
ఈ సినిమాను తారక్ కూడా జీర్ణించుకోలేరు అలా ఉంటాయి మరి సీన్లు అండ్ సినిమా.ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తారకే సెల్ఫ్ ట్రోల్ చేసుకున్నాడు.
03. వినేయ విదేయ రామ
తాను ఇలాంటి సినిమా ఒకటి చేస్తాను అని మన రామ్ చరణ్ కూడా ఎప్పుడూ అనుకొని ఉండడు.అసలు ఆ ఫైట్స్ కానీ ట్రైన్ సీన్ ను కానీ వివరించడానికి మాటలు కూడా సరిపోవు…
02. బ్రహ్మోత్సవం
మహేష్ బాబు కెరీర్ లో ఏమన్నా తప్పు కథను ఎంచుకున్నాడు అంటే అది బ్రహ్మోత్సవం కథే ! సినిమా రిలీజ్ అయ్యిన రోజే థియేటర్స్ ముందు అభిమానులు కూడా లేరంటే సినిమా ఏ రేంజ్ లో ఫ్లాప్ అయ్యింది మీ ఊహకే వదిలేస్తున్నాను.
01.పరమ వీర చక్ర
మన బాలయ్య బాబు సినిమాలు ఎప్పుడూ ట్రోల్ అవ్తునే ఉంటాయి…అయితే బాలయ్య బాబు కెరీర్ లో బాగా ట్రోల్ అయిన సినిమా ‘పరమ వీర చక్ర ‘