in

TOP 10 KANNADA BEAUTIES who made it big in TOLLYWOOD!

10. SREELEELA

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఐకానిక్ మూవీ అయిన ‘పెళ్లి సందడి’ సినిమా టైటిల్ తో రిలీజ్ అయిన పెళ్లిసందడి సినిమాలో హీరోయిన్ హాట్ టాపిక్ అయ్యింది. ఒక్క సినిమాతో జీవితాలు తామ మారు అయిపోతాయంటే.. ఏమిటో.. శ్రీ‌లీల‌ని చూస్తే అర్థ‌మైపోతుంది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ అస‌లు ఈ పాప పేరే తెలీదు. `పెళ్లి సంద‌డి` వ‌చ్చింది.. తాను పాపుల‌ర్ అయిపోయింది. `పెళ్లి సంద‌డి`తో క‌థానాయిక‌గా ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల‌. అక్క‌డి నుంచి త‌ను ఫుల్ బిజీ. ర‌వితేజ సినిమా ‘ధ‌మాకా’ చేస్తోంది. దాంతో పాటుగా న‌వీన్ పొలిశెట్టి సినిమా ఓకే చేసింది. మ‌హేష్ బాబు – త్రివిక్ర‌మ్ సినిమాలో శ్రీ‌లీల రెండో హీరోయిన్ గా న‌టిస్తోంది.

09. SHRADDHA SRINATH

శ్రద్ధ శ్రీనాథ్.. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలనే ఎంపిక చేసుకొని తన కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తోంది ఈ బ్యూటీ. యూ టర్న్ సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. సౌత్ ఇండియా అన్ని భాషల్లోను నటించింది. తమిళ, తెలుగు, కన్నడ ఇలా అన్ని భాషల్లో నటించిన ఈ బ్యూటీ బాలీవుడ్ లో కూడా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది..తెలుగులో నాని ‘జెర్సీ’, సిద్ధూ తో ‘కృష్ణ అండ్ హిస్ లీల’ లో నటించి మెప్పించింది ఈ కన్నడ బేబీ.

08. NABHA NATESH

తెలుగులో వరుసగా అవకాశాలు సంపాదించుకుంటున్న మరో కన్నడ బ్యూటీ నభా నటేష్. నన్ను దోచుకుందువటే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన ఈ హీరోయిన్. ఇస్మార్ట్ శంకర్ హిట్ తో మోస్ట్ ఫేవరెట్ అయిపోయింది. డిస్కోరాజా, సోలోబ్రతుకే సో బెటరూ, అల్లుడు అదుర్స్ రిలీజ్ తో మంచి సక్సెస్ అందుకున్న ఈ కన్నడ హీరోయిన్ వరస అవకాశాలతో మంచి సక్సెస్ అందుకుంటోంది..అంతే కాదు తన నడుము అందాలను చూసిన మనవాళ్ళు జూనియర్ ఇలియానా అని పేరు కూడా ఇచ్చారు..

07. PRANITHA SUBHASH

టాలీవుడ్ నటి కన్నడ బ్యూటీ ప్రణీత. తెలుగు సినిమాలలో మంచి పాత్రలలో నటించి మంచి పేరు సంపాదించుకుంది. తన అందంతో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంది. ఇప్పటివరకు ఎటువంటి గాసిప్ లకు లొంగిపోని బ్యూటీ తాజాగా రహస్యంగా పెళ్లి చేసుకొని బాగా వైరల్ గా మారింది..అతను బ్లూ హరిజన్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను 2011లో ప్రారంభించారని, ఇక ఈ సంస్థకు డైరెక్టర్ గా బాధ్యతలు చేపడుతున్నాడని తెలిసింది. ఇదిలా ఉంటే ప్రణీత ప్రస్తుతం బాలీవుడ్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. హంగామా 2, భుజ్ అనే సినిమాలో నటిస్తుంది.

06. NIDHI AGARWAL

నిధి అగర్వాల్..ఈ అమ్మడిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆతర్వాత అఖిల్ కు జోడీగా మిస్టర్ మజ్ను సినిమాలో నటించి ఆకట్టుకుంది. అయితే డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నిధి పాపులర్ అయ్యింది. ఈ సినిమాలో నిధి తన అందాలతో కుర్రకారుని కట్టిపడేసింది. తక్కువ సినిమాలే చేసిన..నిధి అందానికి ఇక్కడ చాల డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారనే చెప్పాలి..

05. KRITI SHETTY

న్నడ ఇండస్ట్రీనుంచి వచ్చి తెలుగులోకి ఉప్పెనలా వచ్చిన హీరోయిన్ కృతి శెట్టి. టీనేజ్ లోనే హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యి బ్యాక్ టూ బ్యాక్ సినిమా ఛాన్సులు కొట్టేస్తోంది కృతి శెట్టి. ఉప్పెనతో 100కోట్ల హీరోయిన్ అయిపోయిన కృతి..నానితో శ్యామ్ సింగరాయ్, నాగచైతన్యతో బంగార్రాజు సినిమాలతో మెప్పించింది కృతి శెట్టి. టాలెంట్ ఉండాలే కానీ..ఆ ఇండస్ట్రీ..ఈ ఇండస్ట్రీ అన్న తేడాలుండవు సినిమాకి. ఎప్పుడైనా పొరుగింటి పుల్లకూరే రుచి.. అందుకే మన హీరోయిన్లు ఉన్నా..మన పొరుగు రాష్ట్రం పాపలు అంటేనే ఇక్కడి ప్రేక్షకులకు ప్రేమెక్కువ.

04. NITHYA MENON

సౌత్ స్టార్ హీరోయిన్ నిత్యామీనన్ కూడా కన్నడ ఇండస్ట్రీ కర్ణాటక నుంచి వచ్చి తెలుగులో మంచి పేరు సంపాదించుకుంది. ఎప్పుడో ఒకసారి సినిమాలు చేసినా కూడా తెలుగింటి అమ్మాయిగా నిత్యాని ఓన్ చేసేసుకున్నారు టాలీవుడ్ జనాలు. నిత్యా లేటెస్ట్ గా స్కైలాబ్ మూవీ రిలీజ్ చేసింది అంతేకాదు.. భీమ్లానాయక్ లో పవన్ కళ్యాణ్ కు హీరోయిన్ గా నటిస్తోంది ఈ కన్నడ బ్యూటీ. అప్పటి ఐశ్వర్యారాయ్, దీపికా పదుకొనె నుంచి ఇప్పటి హీరోయిన్ల వరకూ శాండల్ వుడ్ నుంచి టాలీవుడ్, బాలీవుడ్ కి వచ్చి టాప్ పొజిషన్ సంపాదించుకున్న హీరోయిన్లు ఇలా చాలా మందే ఉన్నారు.

03. RASHMIKA MANDANNA

ప్రస్తుతం తెలుగు తెరను ఏలుతున్న మరో కన్నడ భామ రష్మిక మందన్న. ఛలో సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన ఈ భామ తొలి సినిమాలోనే అందం అభినయంతోనే ఆకట్టుకుంది. ఫస్ట్ సినిమాలతోనే సక్సెస్‌ రావటంతో లక్కీ హీరోయిన్‌ ట్యాగ్‌ తొలి సినిమాతోనే సొంతం చేసుకుంది. అదే జోరులో గీత గోవిందం సినిమాతో ఏకంగా 120 కోట్లకు పైగా వసూళ్లు..ఇక పుష్ప తో ఏకంగా పాన్ ఇండియా స్టార్స్‌ లిస్ట్‌లో చేరిపోయింది. నాని, నితిన్, మహేష్, అల్లు అర్జున్ ఇలా వరుసగా హీరోల సినిమాలతో బిజీ అయిపోయింది శ్రీవల్లి రష్మిక.

02. POOJA HEGDE

దేంటి తను బాలీవుడ్ హీరోయిన్ కదా అనుకుంటున్నారా. పూజా పేరెంట్స్ ఇద్దరూ కన్నడ వాళ్లే. పుట్టి పెరిగింది వేరే చోట అయినా.. పూజా రూట్స్ మాత్రం కర్ణాటకలోనే. ఎన్టీఆర్ తో అరవింద సమేత, మహేష్ బాబుతో మహర్షి, బన్నీతో అలవైకుంఠపురం, ఇప్పుడు ప్రభాస్ తో రాధే శ్యామ్ సినిమాల్లో హీరోయిన్ గా టాలీవుడ్ లో బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్లతో సెటిల్ అయిపోయింది. ఇప్పుడు వరుసగా స్టార్ హీరోలందరితో సినిమాలు చేస్తూ.. గ్లామర్ తో పాటు యాక్టింగ్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ లు కొడుతూ తెలుగు ఆడియన్స్ ని ఫిదా చేసేస్తోంది ఈ కన్నడ కస్తూరి.

01. ANUSHKA SHETTY

టాలీవుడ్‌ టాప్‌ స్టార్‌గా ఎదిగిన కన్నడ భామ అనుష్క శెట్టి. సూపర్‌ సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ కమర్షియల్ హీరోయిన్‌గా తిరుగులేని స్టార్ డమ్ అందుకుంది. తరువాత లేడి ఓరియంటెడ్ సినిమాలకు సై అంటూ మరింత ఎత్తుకు ఎదిగింది. అరుందతి సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిన యోగా బ్యూటి సైజ్‌ జీరో లాంటి ఎక్స పెరిమెంటల్ సినిమాలు చేసింది. ఇక బాహుబలి సినిమా అనుష్క స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్‌ చేసింది. భాగమతితో మరోసారి సత్తా చాటిన అనుష్క ఇప్పుడు మరొక భారీ సినిమాకు రెడీ అవుతోంది.

This is how Anushka Shetty escaped from casting couch!

anupama parameswaran reveals about her strength and weakness!