in

TOP 10 HIT AND MOST POPULAR FOLK SONGS IN TELUGU MOVIES!

10. ‘DIGU DIGU NAAGA’ FROM VARUDU KAAVALENU   

పాపులారిటీ, వివాదం రెండింటితో జనం నోళ్లలో నానుతున్న తాజా ఫోక్‌ సాంగ్‌ ‘దిగు దిగు దిగు నాగా…’ అసలైన పాటని అష్టవంకర్లు తిప్పి అశ్లీల పదాలు గుప్పించాడని సినిమా గీత రచయిత అనంత్‌ శ్రీరామ్‌పై చాలా విమర్శలొచ్చాయి. అయినా ఈ పాటని యూట్యూబ్‌లో ఇప్పటికే 94లక్షల వ్యూస్‌ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్‌ అయిన ఈ జానపద గీతాన్ని సినిమా కోసం మార్చి రాశాడు అనంత్‌ శ్రీరాం. తమన్‌ సంగీతం అందించాడు. శ్రేయా ఘోషల్‌ తన గాత్రంతో కనికట్టు చేసింది.

09. ‘BHALEGUNDI BAALAA’ FROM SREEKARAM

ర్వానంద్‌, ప్రియాంక అరుల్‌ మోహన్‌ జంటగా నటించిన `శ్రీకారం` చిత్రంలోని `భలేగుంది బాలా` అనే ఫోక్‌ సాంగ్‌ కూడా సినిమా విజయానికి అతీతంగా సక్సెస్‌ సాధించింది. మార్కెట్‌లో ఎక్కడ చూసినా వైరల్‌గా మారింది. మాస్‌ ఆడియెన్స్ ని మెప్పించింది. దీన్ని జానపద పాటల రచయిత పెంచల్‌ దాస్‌ పాడి ఆలపించడం విశేషం. దీనికి `మిక్కీ జే మేయర్‌ సంగీతం అందించారు. సినిమాకి కిశోర్‌.బి దర్శకత్వం వహించారు. ఆయనకిది తొలి చిత్రం కావడం విశేషం. కొత్త దర్శకులు కూడా జానపద పాటలను ఎంకరేజ్‌ చేయడం విశేషం.

08. ‘PEDDA PULI’ FROM CHAL MOHAN RANGA

కొన్ని ఇయర్స్ ముందు ఒక ఊపు ఊపిన పక్కా మాస్ సాంగ్ ఇది…జనరల్ గ ఈ సాంగ్ ని మనం తెలంగాణ పండుగల్లో ఎక్కువ వింటూ ఉంటాము..తెలుగు బిగ్ బాస్ సీసన్ త్రీ విన్నర్ హైదరాబాద్ కుర్రాడు రాహుల్ సిప్లిగంజ్ ఇంక టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇద్దరు కలిసి సాంగ్ ను రి క్రియేట్ చేసారు. మాస్ ఆడియన్స్ ఈ సాంగ్ ను థియేటర్ లో బాగా ఏంజాయ్ చేస్తూ డాన్సులు కూడా చేయడం విశేషం.

07. ‘NAKKILEESU GOLUSU’ FROM PALASA 1978

త్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో బాగా పాపులర్‌ అయిన జానపదం ఇది. అసరయ్య అనే జానపద కళాకారుడు ఆశువుగా ఈ పాట పాడుతూ జనాల్లోకి తీసుకెళ్లాడు. ఎక్కడో దీన్ని విన్న సంగీత దర్శకుడు రఘు కుంచె అతడ్ని వెతికి, అనుమతి తీసుకొని మరీ ‘పలాస 1978’లో ఒక పాటకోసం వాడుకున్నాడు. రియాలిటీ షోలు, పెళ్లి వేడుకలు, టిక్‌టాక్‌ వంటి సోషల్‌మీడియా యాప్‌ల కారణంగా మార్మోగిపోయింది.

06. ‘SARANGA DARIYA’ FROM LOVE STORY

దాని కుడీ భుజం మీద కడవా.. దాని గుట్టెపు రైకలు మెరియా..’ అంటూ సింగర్‌ మంగ్లీ పాడితే జనం ఫిదా అయిపోయారు. ఇక సాయిపల్లవి డ్యాన్స్, ఎక్స్‌ప్రెషన్లు కుర్రాళ్లకి నిద్రకు దూరం చేశాయి. యూట్యూబ్‌లో పాట విడుదలైన వారం రోజులకే వ్యూస్‌ కోటి దాటాయి. ఎంతగా జనాల్లోకి చేరినా దీనిపై కొన్ని వివాదాలు చెలరేగాయి. నేను రాసి, పాడిన పాటను కాపీ కొట్టారంటూ ఒక సింగర్‌ సుద్దాల అశోక్‌తేజ పై విమర్శలు చేశారు. కొన్నాళ్లకు వివాదం సద్దుమణిగింది. మొత్తానికి ఈ వీడియో సాంగ్‌ని ఇప్పటికి ముప్ఫై కోట్లకుపైగా వీక్షించారు. ఇదో రికార్డు.

05. ‘GUNNA GUNNA MAMIDI’ FROM RAJA THE GREAT

గున్న గున్న మామిడి.. జీడీ గింజెలో..జిల్లాటలో..’ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఆర్కెస్ట్రా లేదా రికార్డింగ్ డాన్స్ ప్రోగ్రాం జరిగిన కచ్చితంగా పాడే సాంగ్ ఇది. మాస్ పాటకి కొంచం కామెడీ టచ్ ఇచ్చి..ఈ పాట ను సినిమాకే హైలైట్ అయ్యేలా చేసారు. హీరో రవి తేజ, హరి తేజ, సన, తదితరులు ఈ పాటకు స్టెప్పులు వేసి అలరించిన సంగతి తెలిసిందే. అప్పట్లో సినిమా రిలీస్ అయ్యాక సోషల్ మీడియాలో ఈ సాంగ్ బాగా ట్రెండ్ అయ్యింది.

04. ‘AA GATTUNUNTAAVA’ FROM RANGASTALAM

యాక్టింగ్‌తో ఇరగదీశాడు అని రామ్‌చరణ్‌కి మంచి పేరు తీసుకొచ్చిన సినిమా ‘రంగస్థలం’. ప్రముఖ జానపద సింగర్‌ శివనాగులు దీన్ని చాలా వేదికలపై, రియాలిటీ షోల్లో పాడాడు. సందర్భోచితంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ సినిమా కోసం తీసుకున్నారు. చంద్రబోస్‌ లిరిక్స్‌ ని మార్చి రాశారు. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూర్చాడు. మూడేళ్ల కిందట ఈ పాట పెద్ద హిట్‌ అయ్యింది. అవినీతి రాజకీయాల్ని ఎత్తిచూపే సందర్భాల్లో వస్తే ఈ పాట వినపడుతూనే ఉంటోంది.

03. ‘DHAARI CHOODU’ FROM KRISHNARJUNA YUDDAM

నాని నటించిన ఈ సినిమా ఎంతమందికి గుర్తుందో, లేదో తెలియదుగానీ రెండు, మూడేళ్ల కిందట ఈ జానపదం దుమ్ము దులిపింది. దీన్ని రాసింది, పాడిందీ పెంచల్‌దాస్‌. సినిమాల్లోకి రాకముందే ఈ పాటకు అక్షరం కట్టారాయన. చాలా వేదికలపై పాడారు కూడా. దీన్ని ఓ షోలో చూసిన తర్వాత సినిమా పెద్దలు పెంచల్‌దాస్‌ని సంప్రందించి అతడితోనే పాడించారు. హిప్‌హాప్‌ తమీజా బాణీలు సమకూర్చాడు. పెంచల్‌దాస్‌ని ఓవర్‌నైట్‌ స్టార్‌ని చేసిందీ జానపదం.

02. ‘RAMULOO RAMULAA’ FROM ALA VAIKUNTAPURAMLO

ఫోక్‌ సాంగ్‌కి కిరాక్‌ డ్యాన్స్‌ స్టెప్పులు జోడించి కుర్రకారును ఓ ఊపు ఊపేసిన సాంగ్‌ ‘రాములో రాములా నన్నాగం జేసిందిరో’ కాసర్ల శ్యాం ఈ గీతాన్ని తీర్చిదిద్దితే తమన్‌ బాణీలు అందించాడు. అల్లు అర్జున్, సుశాంత్, పూజా హెగ్డే, నివేదా పెతురాజ్‌ స్టెప్పులతో ఈ పాటని ఓ రేంజ్‌కి తీసుకెళ్లారు. యూత్‌ సెల్‌ఫోన్లకి రింగ్‌టోన్‌గా, వాట్సాప్‌ స్టేటస్‌గానూ ఫేమస్‌ అయ్యింది. గతంలో ఇదే పల్లవితో వచ్చిన రాములో రాములా.. తెలంగాణ యాసలో ప్రాచుర్యం పొందింది. అనురాగ్, మంగ్లీలు ఈ జనపదానికి ప్రాణం పోశారు.

01. PAWAN KALYAN’S LOVE TOWARDS FOLK SONGS

నిజానికి పవన్ కెరీర్ ఆరంభం నుంచే తన ప్రతీ సినిమాలో ఏదో ఒక చిన్న ఫోక్ బిట్ ఉండేలా జాగ్రత్త తీసుకునే వాడు..తమ్ముడు సినిమాలో ‘ఏం పిల్ల మాట్లాడవా- ఓ పిల్లా పిల్లా’, ‘ఖుషి’ సినిమాలో అలీతో కలిసి భాధపడుతూ ‘బై బైయ్యే బంగారు రమణమ్మ’. పవన్ దర్శకత్వం వహించిన జానీ లో కూడా ‘నువ్వు సారా తాగుడు మానురన్నో’.. ఇక ‘అత్తారింటికి దారేది’ లో ‘కాటమరాయుడా’ అనే ఫోక్ సాంగ్ తో పవన్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జానపదాలంటే ఎంతిష్టమో అతడి సినిమాలు చూస్తే అర్థమైపోతుంది.

sai pallavi to play mahesh babu’s sister?

Is Samantha Pregnant In ‘Yashoda’?