in

Tollywood makers eager to bring in ‘Animal’ beauty Tripti Dimri

యానిమల్’ సినిమా రావడానికి ముందు ఈ సుందరి పేరు చాలామందికి పెద్దగా తెలియదు. ఆ తరువాత ఈ బ్యూటీ గురించి తెలియని వారు లేరు. అంతగా ఆమె తన పాత్ర ద్వారా ప్రేక్షకులను ప్రభావితం చేసింది. ఈ సినిమాలో ఆమె బోల్డ్ సీన్స్ లో ఎక్కువగా కనిపిస్తుంది. చక్కని కనుముక్కుతీరుతో..గ్లామర్ పరంగా కుర్రాళ్ల మనసులను దోచేసింది. ఈ సినిమా తరువాత సోషల్ మీడియాలో ఆమె ఫాలోయింగ్ అమాంతంగా పెరిగిపోయింది.

ఇటీవలే బాలీవుడ్ నుంచి వచ్చిన ఊర్వశీ రౌతేలా ఐటమ్ సాంగ్స్ తో ఇక్కడ దూసుకుపోతోంది. కొన్ని సినిమాల్లో ముఖ్యమైన పాత్రలలోను కనిపించనుంది. అలాగే త్రిప్తి డిమ్రిని రంగంలోకి దింపడానికి మేకర్స్ పోటీపడుతున్నారు. ఆల్రెడీ విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి సినిమా కోసం ఆమె ఎంపిక జరిగిపోయిందనే టాక్ వినిపిస్తోంది. ఇక కొంతమంది తమ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా ఆమె ఉండాల్సిందే అనే గట్టిగానే సంప్రదింపులు జరుపుతున్నారని వినికిడి.

queen Anushka Shetty’s to next star in ‘Ghaati’!

samantha becomes a very costly actress now!