LORD VENKATESWARA OF SILVER SCREEN!
తిరుపతి వెంకన్న దర్శనం చేసుకొని వారు, తెలుగు సినీ పరిశ్రమలో యెన్.టి.ఆర్. సహాయం పొందని వారు ఉండరేమో అనటం ఏ మాత్రం అతిశయోక్తి కాదు, పరోపకారి పాపన్న లాగా యెన్.టి.ఆర్. ఎంతో మంది పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయ, సహకారాలనందించారు. అవసరార్ధం వచ్చిన వారికి సహాయం చేయటం ఒక ఎత్తు, ఎదుటి వారి టాలెంట్ ను గుర్తించి వారు అడగకుండానే వారికి సహాయం చేయటం యెన్.టి.ఆర్. నైజం. రాముడు, కృష్ణుడు అనగానే యెన్.టి.ఆర్. నారదుడు అనగానే [...]