సౌత్ ఇండియన్ నెంబర్ వన్ హీరోయిన్గా కొన్నేళ్ల పాటు చక్రం తిప్పిన అనుష్క శెట్టి ‘భాగమతి’ తర్వాత సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. ‘బాహుబలి’ తో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన అనుష్క ప్రస్తుతం ‘నిశ్శబ్దం’ అనే సినిమా చేస్తోంది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకులముందుకు రాబోతుంది. అయితే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపిస్తుంది. కేవలం ఇన్స్టాగ్రామ్ ద్వారానే అనుష్క అభిమానులను పలకరిస్తుంది. తాజాగా ఆమె అభిమానులు ట్విట్టర్ లోకి ఎప్పుడు అడుగుపెడతారని ప్రశ్నించగా ఆమె ఆసక్తికర సమాధానం చెప్పింది. ” నాకు కొంచం సిగ్గు ఎక్కువ కొత్తవాళ్లతో అంతత్వరగా కలవలేను. సినిమాలే నా ప్రపంచం. సినిమాలు లేకపోతే ఇంట్లోనే గడిపేస్తా.. సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకపోవడానికి ప్రత్యేక కారణాలు ఏమీలేవు. టైం కుదరడం లేదు అంతే . ట్విట్టర్ లోకి రాకపోవడానికి కూడా ఇదికూడా ఒక కారణం. నిజానికి దానిగురించి నాకు పెద్దగా అవగాహన లేదు. నా మనసుకు అనిపిస్తే ట్విట్టర్ లోకి అడుగుపెడతా ” అని చెప్పుకొచ్చింది అనుష్క .