తెలుగులో ‘భాష’ సినిమా చేద్దాం అనుకున్న మెగాస్టార్!
భాష సినిమా తెలుగులో విడుదల కావడానికి ముందు ఈ సినిమాని రీమిక్స్ చేయమని డైరెక్టర్ చిరంజీవిని సంప్రదించాలనుకున్నారట. సినిమా రిలీజ్ కి ముందే డైరెక్టర్ సురేష్ కృష్ణ చిరంజీవి ఏదో సినిమాలో చెన్నైకి షూటింగ్ కి రావడంతో డైరెక్టర్ చిరంజీవిని కలవడం జరిగింది. ఆ సమయంలోనే భాష సినిమా గురించి చెప్పగా తెలుగులో రీమిక్స్ చేస్తే బ్లాక్ బస్టర్ సినిమా అవుతుందని చిరంజీవి భావించడంతో ఆ సినిమా హక్కులను ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ తీసుకోవడానికి సిద్ధమయ్యారట.
అల్లు అరవింద్ వల్ల బ్లాక్ బస్టర్ ‘భాష’ మిస్ చేసుకున్న చిరంజీవి!
అయితే తమిళ ప్రొడ్యూసర్ ని సంప్రదించి తెలుగు రైట్స్ అడిగేసరికి ఏకంగా ఈ సినిమాకి రూ. 40 లక్షల రూపాయలు చెప్పారట. అయితే వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితులలో ఈ అమౌంట్ పెద్ద విషయమేమీ కాదు కానీ 25 సంవత్సరాల క్రితం.. అల్లు అరవింద్ 25 లక్షల రూపాయలకి అడిగారట కానీ ప్రొడ్యూసర్ ఒప్పుకోకపోవడంతో అల్లు అరవింద్ ఆ ప్రాజెక్టును వదిలేశారు అయితే ఆ సినిమాని రజినీకాంత్ తెలుగులోనే డబ్బింగ్ చేసి విడుదల చేయగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది ఈ సినిమాని మిస్ చేసుకోవడంతో చిరంజీవి కెరియర్ లో ఒక బ్లాక్ బాస్టర్ సినిమా మిస్సయిందని చెప్పవచ్చు..!!