in

Thapsi says her ‘sex life is not interesting enough’!

కొత్త సినిమాలు ఏవి రిలీజవుతున్నా, దాని టీం మెంబర్స్ ‘కాఫీ విత్ కరణ్’ షోకు వెళ్లి ప్రమోట్ చేయడం మామూలే. ఆగస్టు 19న తాప్సి సినిమా ‘దోబారా’ విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మీరు ‘కాఫీ విత్ కరణ్’ షోకు వెళ్లరా అని మీడియా వాళ్లు తాప్సిని అడిగారు. దీనికి ఆమె బదులిస్తూ.. ‘‘కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొనేలా నాసెక్స్ లైఫ్ అంత గొప్పగా ఏమీ లేదు’’ అని బదులిచ్చింది. ఈ ఆన్సర్ తాప్సి.. కరణ్‌కు మామూలు పంచ్ ఇవ్వలేదని నెటిజన్లు ఆమెను కొనియాడుతున్నారు.

ఈ షోలో ఎప్పుడూ సెక్స్‌కు సంబంధించిన ప్రశ్నలే కరణ్ అడుగుతుంటాడనే అర్థం వచ్చేలా తాప్సి మాట్లాడిందని.. నేరుగా షో గురించి ఏమీ అనకుండా ఈ పంచ్‌తో అదరగొట్టేసిందని ఆమెపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఐతే ఇలాంటి వాటికి కరణ్ ఇప్పటి దాకా పెద్దగా స్పందించింది లేదు. తన తీరు మార్చుకున్నది లేదు. మరి తాప్సి వేసిన పంచ్‌తో అయితే తన షో పట్ల మామూలు జనాల్లోనే కాదు.. ఇండస్ట్రీ వాళ్లలో కూడా ప్రతికూల అభిప్రాయం ఉందని, తాను మరీ శ్రుతి మించుతున్నానని కరణ్ అర్థం చేసుకుంటే బాగుంటుందేమో..

Naga Chaitanya to romance Rashmika Mandanna!

JAYASUDHA IGNORED SOBHAN BABU’s suggestion!