in

thamanna to play the role of Jamuna in the biopic?

ల‌నాటి అందాల న‌టి జ‌మున ఇటీవ‌లే క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. పాతికేళ్ల పాటు చిత్ర‌సీమ‌లో అగ్ర క‌థానాయిక‌గా కొన‌సాగిన జ‌మున‌.. త‌న సినీ ప్ర‌యాణంలో దాదాపుగా 200 చిత్రాల్లో న‌టించారు. ఎంతోమంది స్టార్ హీరోలతో జోడీ క‌ట్టారు. త‌న సినీ జీవితంలో ఎన్నో ఎత్తు ప‌ల్లాలున్నాయి. ఇవ‌న్నీ త్వ‌ర‌లోనే బ‌యోపిక్‌గా రాబోతున్నాయ‌ని స‌మాచారం. ఓ త‌మిళ ద‌ర్శ‌కుడు జ‌మున బ‌యోపిక్ తీయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట‌. క‌థానాయిక‌గా..త‌మ‌న్నాని సంప్ర‌దించిన‌ట్టు స‌మాచారం. ఒక‌వేళ త‌మ‌న్నా కాద‌న్న ప‌క్షంలో సాయి ప‌ల్ల‌విని ఎంచుకొనే అవ‌కాశాలున్నాయ‌ని టాక్‌.

త‌మ‌న్నా కూడా చాలా కాలంగా ఓ బ‌యోపిక్ కోసం ఎదురు చూస్తోంది. క‌థ న‌చ్చితే.. త‌మ‌న్నా ఈ సినిమాలో ఫిక్స్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. తెలుగులో బ‌యెపిక్ అన‌గానే గుర్తొచ్చే సినిమా `మ‌హాన‌టి`. సావిత్రి జీవిత క‌థ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీసు ద‌గ్గ‌ర మంచి విజ‌యాన్ని అందుకొంది. అనేక అవార్డులు సాధించింది. ఈ సినిమాతో కీర్తి సురేష్ స్టార్ అయిపోయింది. అప్ప‌టి నుంచీ టాలీవుడ్ లో స‌రైన బ‌యోపిక్ రాలేదు. జ‌మున గ‌నుక‌..తెర‌పైకెళ్తే.. మ‌హాన‌టి త‌ర‌వాత అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించే సినిమా ఇదే అవుతుంది..!!

AKKINENI VAARI” THATHA” GAARU YEVARU?

Michael!