in

thamanna keeps all her hopes on megastar’s ‘bhola shankar’!

క‌ప్పుడు త‌మ‌న్నా…టాలీవుడ్ లో టాప్ హీరోయిన్‌. క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు, ఐటెమ్ పాట‌లు అంటూ తెగ బిజీ. అయితే కొత్త క‌థానాయిక‌ల రాక‌తో… త‌మ‌న్నా ప్రాబ‌ల్యం బాగా త‌గ్గింది. పైగా.. త‌న ఖాతాలో ఈమ‌ధ్య హిట్లు లేవు. చేతిలో 3 తెలుగు సినిమాలు ఉన్నాయి. ఎఫ్ 3, భోళా శంక‌ర్‌, గుర్తుందా శీతాకాలం సినిమాలు చేస్తోంది. ఆ త‌ర‌వాత‌.. త‌మ‌న్నా ప‌రిస్థితేమిటి? అనేది పెద్ద ప్ర‌శ్న‌. ఈ మ‌ధ్య త‌మ‌న్నా కొత్త‌గా ఒప్పుకున్న సినిమాలేం లేవు. ఈ మూడూ అయిపోతే త‌మ‌న్నా ఖాళీనే. గుర్తుందా శీతాకాలంలో స‌త్య‌దేవ్ ప‌క్క‌న న‌టించింది. ఈ సినిమాలో మ‌రో ఇద్ద‌రు హీరోయిన్లు ఉన్నారు. కాబ‌ట్టి.. త‌మ‌న్నా చేసేదేం ఉండ‌దు.

ఇక ఎఫ్ 3.. పూర్తి గా ఫ‌న్ రైడ్ సినిమా. ఆ సినిమా హిట్ట‌యితే.. క్రెడిట్ మొత్తం హీరోల‌కూ, ద‌ర్శ‌కుడికి పోతుంది. ఎఫ్ 2 విష‌యంలో ఇదే జ‌రిగింది. ఆ సినిమా సూప‌ర్ హిట్ట‌యినా త‌మ‌న్నా క్యాష్ చేసుకోలేకపోయింది. ఇక త‌న చేతిలో ఉన్న క‌మ‌ర్షియ‌ల్ సినిమా భోళా శంక‌ర్ ఒక్క‌టే. ఈ సినిమా ఎలాగూ రీమేకే. కాబ‌ట్టి… మినిమం గ్యారెంటీ ఉంటుంది. చిరు సినిమా హిట్ట‌యితే.. క‌చ్చితంగా త‌మ‌న్నాకు ప్ల‌స్సే. సీరియ‌న్ హీరోలు మ‌ళ్లీ త‌మ‌న్నాపై దృష్టి పెట్టే అవ‌కాశం ఉంది. అందుకే త‌మ‌న్నా చిరు సినిమాపైనే ఆశ‌లు పెట్టుకుంద‌ట‌. ఈ సినిమాకి ఎన్ని డేట్లు కావాలంటే అన్ని కేటాయించ‌డానికి త‌మ‌న్నా రెడీ అవుతోంద‌ని టాక్.

Shruti Hassan Maxim Hot Photoshoot!

vakeel saab beauty Ananya Nagalla debuts in Kollywood!