in

Sandeep Vanga Loves To Make a film with his idol chiranjeevi!

త్వ‌ర‌లో యానిమ‌ల్ డైరెక్ట‌ర్‌..మ‌న మెగాస్టార్ చిరంజీవితో జ‌ట్టు క‌ట్ట‌బోతున్నాడు. చిరు అంటే సందీప్‌కి విప‌రీత‌మైన అభిమానం. సందీప్ ఫేవ‌రెట్ హీరో చిరంజీవినే. ఈ విష‌యం చాలాసార్లు చెప్పాడు. చిరుతో క‌లిసి ప‌నిచేయాల‌ని ఉంద‌ని త‌న మ‌న‌సులోని మాట బ‌య‌ట‌పెట్టాడు. ఇటీవ‌ల చిరంజీవికి కేంద్ర ప్ర‌భుత్వం ప‌ద్మ‌విభూష‌ణ్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా  మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లుసుకొన్నాడు సందీప్.

ఆ టైమ్ లోనే చిరంజీవి..’నాతో సినిమా చేయాల‌ని ఉంద‌ని చెప్పావ‌ట‌.. మ‌రి క‌థ ఉందా’ అంటూ కూపీ లాగిన‌ట్టు తెలుస్తోంది. చిరంజీవి నుంచి సందీప్ ఇలాంటి డైలాగ్ ఊహించ‌లేదు. అయినా స‌రే, వెంట‌నే తేరుకొని ‘మీరు ఎప్పుడంటే అప్పుడే సార్‌’ అంటూ బ‌దులు ఇచ్చిన‌ట్టు సన్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి. సందీప్ తో ప‌ని చేయ‌డానికి చిరు కూడా సిద్ధ‌మే. ఇక అడ్డేముంది? అన్నీ అనుకొన‌ట్టు జ‌రిగితే…’స్పిరిట్’ ముగిసిన వెంట‌నే ఈ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కొచ్చు..!!

nani to join hands with balagam venu?

thalapathy vijay joining forces with rrr makers!