50ఏళ్ల ఈ హీరో ఇప్పుడు కెరీర్ లోనే చివరి సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే పొలిటికల్ పార్టీని ప్రకటించిన ఆయన.. త్వరలోనే ఫుల్ టైమ్స్ పాలిటిక్స్ లోకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇదే తన చివరి సినిమా అని ప్రకటించారు. ఈ సినిమాకు దళపతి 69 అనే వర్కింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. దీన్ని హెచ్.వినోత్ డైరెక్ట్ చేస్తున్నారు..
అయితే ఈ సినిమా కోసం ఆయన ఏకంగా రూ.250 కోట్లు తీసుకుంటున్నారంట. ఇప్పటి వరకు ఏ హీరో కూడా ఇంత పెద్ద మొత్తంలో తీసుకోలేదు. ఆయన గోట్ సినిమాకు ఏకంగా రూ.200 కోట్లు తీసుకున్నారు. ఇప్పుడు ఇంకో యాభై కోట్లు ఎక్కువ తీసుకుంటున్నాడు విజయ్. అటు ప్రొడ్యూసర్లు కూడా ఇంత పెద్ద మొత్తంలో ఇచ్చేందుకు వెనకాడట్లేదు. ఎందుకంటే విజయ్ తన సినిమాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉన్నాడు..!!