in

telugu girl meenakshi chowdary’s next to be with Ravi Teja?

మీనాక్షి చౌదరి..చూడగానే నచ్చేసే మన తెలుగు అందం..ఖిలాడీ, హిట్-2 సినిమా తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటీ ఇటీవల కాలంలో అనూహ్యంగా వరుస సినిమా అవకాశాలు దక్కించుకొంటోంది. ఎక్సపోసింగ్ కు ఏమాత్రం మొహమాటం లేదంటూ ఓపెన్ గ చెప్పకనే చెబుతుంది మీనాక్షి..దీనికి తాను చేసే హాట్ ఫోటో షూట్స్ ఏ రుజువు.  ఇప్పటికే మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసిన మీనాక్షి చౌదరి, మరో క్రేజి ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా నటించే అవకాశం కొట్టేసిందని వార్తలు వినిపిస్తోన్నాయి. అయితే ఆ క్రేజీ ప్రాజెక్ట్ ఏంటా..అని అనుకుంటున్నారా??

ఆ సినిమా మరేదో కాదు రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రాబోతున్న సినిమా. రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వర రావు, ఈగల్ సినిమాలలో నటిస్తున్నాడు..ఈ రెండు సినిమాల అనంతరం రవితేజ గోపీచంద్ మలినేని సినిమా ప్రారంభమవబోతుంది. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా క్యాస్టింగ్ ను కూడా ఫైనల్ చేసుకుంటుంది. అందులో భాగంగానే మెయిన్ హీరోయిన్ గా శ్రీలీల ను ఫైనల్ చేశారట. అలాగే సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం గాను మీనాక్షి చౌదరి ని తీసుకున్నట్టు సమాచారం. దీనిబట్టి చూస్తే మీనాక్షి త్వరలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయ్యేలాగా ఉందని చెప్పవచ్చు..!!

Mark Antony!

samyuktha menon dominating hero’s performance!