in

Is Skin Show also Sanatana Dharma? Rashmi Responds

ఇటీవల తొలిసారిగా సనాతన ధర్మంపై సోషల్‌ మీడియాలో వరుస పోస్టులు చేస్తున్నది. ఈక్రమంలో పలువురు యాంకరమ్మను ట్రోల్‌ చేస్తున్నారు. ఓ నెటిజన్‌ రష్మిపై ‘స్కిన్‌ షో, ఎక్స్‌పోసింగ్‌ సైతం సనాతన ధర్మమేనా?’ అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం రష్మి ‘బాయ్స్‌ హాస్టల్‌’ చిత్రంలో నటిస్తున్నది. అయితే, ఈ చిత్రాన్ని ఉద్దేశించి నెటిజన్‌ సెటైర్‌ వేయగా..రష్మి తనదైన శైలిలో స్పందించింది. ‘వాదనలు గెలవలేనప్పుడు ఇలాంటి ఫొటోలు పెట్టి సంబంధం లేని ప్రశ్నలు అడుగుతారు’ అంటూ ఘాటుగానే స్పందించింది.

‘ఇది సంస్కృతిలో ఓ భాగం. మీరు ఏ స్కిన్‌ షో గురించి మాట్లాడుతున్నారు ? దండయాత్రలు జరగడానికి ముందు మేం ఎలా దుస్తులు ధరించమో దయచేసి తెలుసుకోవాలి? హిందూ బాలికలు ఎలా ధరించారు ? ఏం ధరించారు ? అనేది తెలుసుకోవాలి. మేం ఎప్పుడూ ఇంత నిస్సారంగా లేము. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ఆంక్షలు మానవ నిర్మితమే. వాటికి హిందూమతం, సనాతన ధర్మంతో సంబంధం లేదు’ అంటూ బదులిచ్చింది. దీనికి స్పందించిన నెటిజన్‌ హీరోయిన్లు సనాతన ధర్మం గురించి మాట్లాడే ముందు స్కిన్‌షోను ఆపేయాలని సూచించాడు..!!

Critical Time for dusky beauty Pooja Hegde!

Mark Antony!