in

telugu girl aishwarya rajesh gets another interesting role!

మలయాళంలో గొప్ప సినిమాగా పేరు తెచ్చుకున్న ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ తమిళ రీమేక్‌లో ఐశ్వర్య ప్రధాన పాత్ర పోషించనుంది. ఇందులో ఆమెకు జోడీగా రాహుల్ రవీంద్రన్ నటించనుండటం విశేషం. ఒక సంప్రదాయ కుటుంబంలోకి కోడలిగా వచ్చిన అమ్మాయి అక్కడి కట్టుబాట్ల వల్ల ఎలా ఇబ్బంది పడింది.. ఇంతగా అభివృద్ధి చెందాక కూడా మహిళల్ని సమాజం ఎలా తక్కువగా చూస్తుంది.. చదువుకున్న భర్తలు కూడా కట్టుబాట్ల పేరుతో మహిళల పట్ల ఎలా వివక్ష చూపిస్తారనే అంశాల్ని చాలా సున్నితంగా చర్చించిన సినిమా ఇది.

చిన్న కాన్సెప్ట్ తీసుకుని హృద్యంగా తెరకెక్కించిన ఈ చిత్రం గొప్ప ప్రశంసలు అందుకుంది. ఒరిజినల్లో సూరజ్, నిమిష ప్రధాన పాత్రలు పోషించారు. సినిమాలో హీరోయిన్‌దే అత్యంత కీలక పాత్ర. అలాంటి క్యారెక్టర్ ఐశ్వర్యను వెతుక్కుంటూ వచ్చింది. ఈ సినిమాతో ఐష్ పేరు మరోసారి కోలీవుడ్లో హాట్ టాపిక్ అవడం గ్యారెంటీ అంటున్నారు. రాహుల్, ఐశ్వర్య తెలుగు ప్రేక్షకులకు పరిచయమే కాబట్టి ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేసే అవకాశాలున్నాయి..

Mega item bhama Raai Lakshmi recovered from injury!

Sonakshi Sinha to pair with Chiranjeevi and balakrishna?