in

Mega item bhama Raai Lakshmi recovered from injury!

ప్రముఖ గ్లామర్ బ్యూటీ రాయ్‌లక్ష్మీ షూటింగ్ లో ప్రమాదానికి గురైంది. అయితే  సినిమాలు ఉన్నా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ ఫుల్ బిజీగా రాయ్ లక్ష్మీ ఉంటుంది. ఈమెకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కూడా బాగానే ఉన్నారు. ప్రస్తుతం ఓ సినిమా కోసం హైదరాబాద్‌లోనే ఉంది ఈ భామ. మార్చి 20 అర్ధరాత్రి బంజారాహిల్స్‌లో ఓ సినిమా చిత్రీకరణలో పాల్గొంది. దీనికి సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో కూడా పోస్ట్ చేసింది ఈ బ్యూటీ. షూట్‌కు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసింది.

అయితే అదే సమయంలో ఈ భామకు ప్రమాదం జరిగింది. ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో రాయ్ లక్ష్మీకి అనుకోని ప్రమాదం జరిగింది. మార్చి 20 అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఫైట్స్‌ చిత్రీకరణలో పాల్గొన్న ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే, ఆమె తృటిలో పెనుప్రమాదం నుంచి తప్పించుకుంది. ప్రస్తుతం రాయ్‌లక్ష్మీ హాస్పటిల్ ‌లో ట్రీట్‌ మెంట్‌ తీసుకుని డిశ్చార్జ్‌ కూడా అయినట్లు తెలుస్తోంది. ఇంతకీ, ఆమె గాయపడింది ఒక తెలుగు సినిమా షూటింగ్ లోనే. రాయ్‌లక్ష్మీ ప్రధాన పాత్రలో తెలుగులో ఓ వైవిధ్యమైన చిత్రం రూపొందుతోంది.  త్వరలోనే ఆమె తిరిగి చిత్రీకరణలో పాల్గొనుందని చిత్రబృందం తెలిపింది.

samantha started exporting her clothing brand ‘saaki’ international!

telugu girl aishwarya rajesh gets another interesting role!