ప్రియురాలు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటి కామాక్షి భాస్కర్ల. అయితే.. విరుపాక్ష, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్, రౌడీ బాయ్స్, ఓం భీం బుష్ సినిమాల్లో నటించినా..పొలిమేర, పొలిమేర,-2 సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో టాలీవుడ్, ఆడియన్స్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపే తెచ్చుకుంది. ఇటివల ఓ యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ.. తన పాత్రలపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యాయి. తాను ఎటువంటి రోల్స్ చేయడానికైనా సిద్ధమని చెప్పింది..
సినిమా కాబట్టి అనేక పాత్రలు వస్తాయి.. వాటన్నింటినీ చేస్తేనే కదా నేను నటిని అనిపించుకుంటానని చెప్పుకొచ్చింది. బోల్డ్ సీన్స్, న్యూడ్ గా నటించడానికైనా సిద్ధమేనా అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చిందీ భామ. ‘నటిని కాబట్టి తప్పకుండా చేస్తాను. బోల్డ్, న్యూడ్, సిగ్గుపడుతూ నటించినా అవన్నీ పాత్రలో భాగం. నటిగానే చేస్తాను.. నన్ను నటిగానే చూడాలి..!!