in

teja jeevithanni marchesina okka sorry!

తేజ ట్రెండ్ సెట్టర్ డైరెక్టర్ తేజ, కెమెరా డిపార్ట్ మెంట్ లో అసిస్టెంట్ గ చేరి సినీ జీవితం ప్రారంభించి, డైరెక్టర్ గ ఎలా మారారు అనే స్టోరీ చాల ఇంటరెస్టింగ్ గ ఉంటుంది, మద్రాస్ లో కెమెరా మాన్, మహీధర్ దగ్గర అసిస్టెంట్ గ పని చేస్తున్న రోజుల్లో ఒక కొత్త అసిస్టెంట్ డైరెక్టర్ కి డైరక్షన్ ఛాన్స్ వచ్చింది అతని దృష్టి తేజ మీద పడింది, అతనితో కలసి హైదరాబాద్ చేరుకున్న తేజ 1500 రూపాయలు జీతం కి చేరిన తేజ, అసిస్టెంట్ గ ఆ మూవీ కి స్టోరీ వర్క్ చేయట మే కాకూండా పబ్లిసిటీ డిజైనింగ్ కూడా చేసారు, ఒక కొత్త ట్రెండ్ క్రియేట్  చేసారు, మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది తెలుగు సినిమా గమనం ను మార్చిన డైరెక్టర్ గ రామ్ గోపాల్ వర్మ అవతరించాడు.పబ్లిసిటీ డిజైనింగ్ నచ్చిన నిర్మాత అక్కినేని వెంకట్ గారు తేజ కు 10000 రూపాయలు గిఫ్ట్ గ ఇచ్చ్చారు, ఆ మూవీ తరువాత రాత్రి సినిమా తో సినిమాటోగ్రఫేర్ గ మారారు।సినిమాటోగ్రాఫర్ గ బిజీ గ ఉన్న రోజుల్లో రామోజీ ఫిలిం సిటీ లో ఒక షూటింగ్ లో బిజీ గ ఉన్న టైం లో ఒక పెద్దాయన వచ్చి ఫిలిం సిటీ గురించి అభిప్రాయం అడిగారు ,పని ఒత్తిడి లో ఉన్న తేజ చాలా క్యాజువల్ గ బాగుందండి అని చెప్పి తన పనిలో తాను ఉండిపోయారు। తరువాత తెలిసింది ఆ వ్యక్తి రామోజీ రావు గారు అని, నెక్స్ట్ డే రామోజీ రావు గారిని వారి ఆఫీస్ లో కలసి సారీ చెప్పి ఫిలిం సిటీ లో ఫెసిలిటీస్ చాల బాగున్నాయి, ౩౦  లక్షల్లో మూవీ చేసేయ వచ్చు అని చెప్పారు, వెంటనే రామోజీ గారు స్టోరీ రెడీ చేసుకోండి 40 లక్షలు బడ్జెట్ ఇస్తాను మీరే డైరెక్ట్ చేయండి అంటూ ఆఫర్ ఇచ్చారు।తేజ అప్పటికి అప్పుడు ఒక స్టోరీ చెప్పేసారు, చిత్రం సినిమా కు ఉంకురార్పణ జరిగింది. 40 లక్షల బడ్జెట్ 42 అయింది అందుకు తేజ గారు రామోజీ గారికి సారీ చెప్పారు.సినిమా ఒక న్యూ ట్రెండ్ సెట్ చేసింది కలెక్షన్ రికార్డు శ్రీష్టించింది ।తేజ పేరు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మారుమ్రోగింది.మ్రొక్కబోయిన దేవుడు ఎదురు వచ్చి వరం ఇచ్చినట్లు రామోజీ గారి ద్వారా డైరెక్టర్ గ ప్రస్థానం మొదలు పెట్టారు తేజ గారు.తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవడమే కాకుండా ఎంతో మంది కొత్త నటి, నటులను, తెక్నిషియన్స్ ను తెలుగు తెర కు పరిచయం చేసారు తేజ గారు.

Leave a Reply

Loading…

0

Brochevarevarura

35 years for mahanagaramlo mayagadu!