in

Tamannaah about uncomfortable reality of women in South films!

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తమన్నా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీపై చేసిన కొన్ని బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్లను కేవలం గ్లామర్ బొమ్మలుగా చూసే విధానం తనకు అస్సలు నచ్చలేదని తమన్నా చాలా ఓపెన్‌గా చెప్పింది. సౌత్ ఇండస్ట్రీలో పురుషాధిక్యత ఎక్కువగా కనిపిస్తుంటుందని, హీరోయిన్లను స్క్రీన్‌పై గౌరవప్రదంగా చూపించే విషయంలో అక్కడ కొంత లోటు కనిపిస్తోందంటూ తన మనసులోని అసంతృప్తిని బయటపెట్టింది..

భారతీయ సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ అయిన పాటలు, డ్యాన్సులకు చాలా ప్రాధాన్యత ఉంటుందని..ఈ విషయాన్ని తాను కెరీర్ ప్రారంభంలోనే గ్రహించానని తమన్నా తెలిపింది. బాలీవుడ్‌లో కేవలం యాక్టింగ్ మాత్రమే చేసే హీరోయిన్లు కొందరైతే, గ్లామర్ పాత్రలకే పరిమితమయ్యే వాళ్లు మరికొందరు ఉంటారని విశ్లేషించింది. కానీ, కేవలం ఒకే యాంగిల్‌కు పరిమితం కాకుండా..అటు గ్లామర్ చూపిస్తూనే, ఇటు నటనకు స్కోప్ ఉన్న పాత్రలు చేయగలిగిన వారే ఇండస్ట్రీలో సూపర్ స్టార్లుగా ఎదుగుతారని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది..!!

happy birthday vijaya shanthi!

samantha restoring faith in the lady oriented films!