in

happy birthday vijaya shanthi!

విజయ శాంతి పరిచయం అఖ్ఖరలేని సినీ, పొలిటికల్ సెలబ్రిటీ, తెలుగు ప్రేక్షకులు, తెలుగు సినీ పరిశ్రమ లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్, అని ప్రేమగా పిలుచుకుంటారు. విజయ శాంతి గారు, భారతి రాజా గారి డైరెక్షన్ లో వచ్చిన కళుక్కుళ్ యీరం, అనే చిత్రం తో 1980 లో చిత్ర రంగ ప్రవేశం చేసారు, అదే సంవత్సరం కిలాడీ కృష్ణుడు అనే తెలుగు చిత్రం లో కృష్ణ గారి కి జోడి గ నటించారు. మూడు దశాబ్దాల సుదీర్ఘ కాలం, 180 చిత్రాల ప్రయాణం, 7 ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్, 4 నంది అవార్డులు, నాలుగు దక్షిణ భారతీయ భాషలతో పాటు హిందీ చిత్రాలలో కూడా నటించారు.

కథానాయిక ప్రాధాన్య పాత్రలు పోషించి తన ప్రత్యేకత ను చాటుకున్న విజయ శాంతి గారు, రాజకీయ రంగ ప్రవేశం చేసి తనదైన శైలి లో రాణించారు. 13 సంవత్సరాల సుదీర్ఘ విరామం తరువాత, మహేష్ బాబు చిత్రం సరిలేరు నీకెవ్వరు అనే చిత్రం లో ఒక పవర్ఫుల్ పాత్రలో రీఎంట్రీ ఇచ్చారు విజయశాంతి గారు. జూన్, 24 వ తేదీ 1966 లో జన్మించిన విజయ శాంతి గారికి, వారి జన్మదిన సందర్భంగా మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేసుకుంటున్నాము. వారి సెకండ్ ఇన్నింగ్స్ కూడా విజయవంతంగా సాగిపోవాలని, వారు మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలి అని మనసారా కోరుకుంటున్నాము..

rukmini vasanth hints being caste in ntr neel movie!

Keerthy Suresh Breaks Silence On Equal remunerations!