in

samantha restoring faith in the lady oriented films!

టాలీవుడ్‌లో ఒకప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రత్యేకమైన మార్కెట్ ఉండేది. స్టార్ హీరోల సినిమాలకు సమాంతరంగా స్టార్ హీరోయిన్ల సినిమాలు కూడా థియేటర్లలో సందడి చేసేవి. కానీ గత కొన్నేళ్లుగా ఆ జోరు కాస్త తగ్గిపోయింది. అప్పుడప్పుడూ కొన్ని ప్రయత్నాలు జరిగినా, అవి పెద్దగా కమర్షియల్ ఫలితాలు సాధించలేకపోయాయి. అనుష్క‌, కీర్తి సురేష్, త‌మ‌న్నా, న‌య‌న‌తార లాంటి క‌థానాయిక‌లు ఇటీవ‌ల కొన్ని ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ స‌ఫ‌లం కాలేదు. దాంతో నిర్మాత‌లు వెనుక‌డుగు వేశారు. ఇలాంటి క‌థ‌లు రావ‌డ‌మే మానేశాయి..

అలాంటి సమయంలో సమంత ప్రధాన పాత్రలో వచ్చిన ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ దగ్గర ఆశాజనకమైన ఫలితాలు నమోదు చేయడం పరిశ్రమలో కొత్త ఆశ‌లు చిగురించాయి. గ‌త‌వారం విడుద‌లైన ఈ చిత్రానికి మంచి ఫ‌లిత‌మే వ‌చ్చింది. బ‌డ్జెట్ మొత్తం నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ తో క‌వ‌ర్ అయ్యాయి. థియేట‌ర్ల నుంచి వ‌చ్చిన‌దంతా లాభ‌మే. తొలి 5 రోజుల్లో నమోదైన వసూళ్లు, ప్రేక్షకుల స్పందన చూస్తే..ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాకు కూడా సరైన కథ, సరైన ప్రచారం ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనే సంకేతాలు కనిపిస్తున్నాయి..!!

Tamannaah about uncomfortable reality of women in South films!

Nayanthara in an action-packed mode for salman khan’s film!